Delhi school: ఢిల్లీలోని ఓ స్కూల్లో భయంకర సంఘటన చోటుచేసుకుంది. ఐదొవ తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడు తుపాకితో పాఠశాలకు రావడంతో సిబ్బందితోపాటు తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బాలుడి దగ్గరనుంచి తుపాకి తీసుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులను పిలిపించి విచారించగా.. ఆ తుపాకి పిల్లవాడి తండ్రిదని తెలిపారు. అతడు కొన్ని నెలలక్రితం చనిపోవడంతో ఇంట్లోనే దాచి ఉంచామని, అనుకోకుండా తమ పిల్లవాడు తీసుకొచ్చాడని వివరించారు. దీంతో తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే లైసెన్స్ రద్దు చేయాలని అధికారులకు సూచించారు. ఇక ప్రమాదకరమైన వస్తువులను పిల్లలకు దూరంగా ఉంచాలని, నిరంతరం స్కూల్కు వెళ్లే పిల్లల బ్యాగ్ చెక్ చేయాలని తెలిపారు.