/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-79-1-jpg.webp)
Taapsee Pannu About Shahrukh Khan: స్టార్ నటి తాప్సీ పన్నూ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను నటించిన సూపర్ హిట్ మూవీ ‘హసీన్ దిల్‌రుబా’ (Haseen Dilruba)కు సీక్వెల్ గా రాబోతున్న ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ ('Phir Ai Haseen Dilruba') త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది తాస్పీ. ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇటీవల షారుఖ్ సరసన నటించిన 'Dunki' సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
#NewProfilePic pic.twitter.com/jUt9AfYNY8
— taapsee pannu (@taapsee) July 3, 2019
ఈ మేరకు ‘నేను షారుఖ్ ఖాన్ సరసన నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. మరి హీరోయిన్ గా అవకాశం వస్తుందని అనుకోలేదు. నిజంగా ఈ మూవీ కోసం ఆయనతో రెండేళ్లు పనిచేయడం వల్ల గొప్ప అనుభూతిపొందాను. 'Dunki' సినిమా నాకు ఎన్నో విషయాలు నేర్పింది. షూటింగ్ టైమ్ లోనూ తన జీవితంలో జరిగిన అన్నీ సంఘటనల్ని నాతో పంచుకున్నారు షారుఖ్ (Shahrukh Khan). మంచి నటులుగా ఎదగాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు. అంతేకాదు నిజ జీవితంలోనూ ఉన్నత విలువలతో ఎలా ఉండాలనే విషయాలు కూడా చెప్పారు. నిజంగా ఇలాంటి గొప్ప నటుడితో పనిచేయడం ఎవరికైనా ఒక లక్కీ ఛాన్స్ లాంటిదే' అంటూ ప్రశంసలు అతనిపై కురిపించింది.
ఇది కూడా చదవండి : Axer patel - ఆ వార్త వినగానే నా కాళ్లు చేతులు ఆడలేదు.. పంత్ యాక్సిడెంట్ పై అక్షర్ ఎమోషనల్
ఇక దర్శకుడు జయ్‌ప్రద్ దేశాయ్ తెరకెక్కిస్తున్న ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ మర్డర్ మిస్టరీగా రానుంది. నిర్మాత కనికా థిల్లాన్ ఈ సినిమా తప్పకుండా బిగ్ హిట్ అవుతుందని, మొదటినుంచే హైప్ పెంచేస్తున్నారు. ఉత్కంఠభరితంగా సాగే మూవీలో విక్రాంత్ చేసిన పాత్రతోపాటు తాప్సీ క్యారెక్టర్ ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.