సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పంజాబీకి చెందిన ఈ బ్యూటీ తెలుగు, తమిల్ లోనూ పలు సినిమాలు చేసి అలరించింది. అయితే కొంతకాలానికి టాలీవుడ్ లో అవకాశాలు లేక బాలీవుడ్ చెక్కేసిన నటి.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోపాటు స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన షారుఖ్ మూవీ 'DUNKI'లో ఓ కీలక పాత్రలో మెరిసిన ఆమె సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కెరీర్ అండ్ పలు పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది.
ఈ మేరకు రాజ్ కుమార్ హిరాణి తెరకెక్కించిన ‘DUNKI’ డిసెంబర్ 21న విడుదలై పాజిటీవ్ టాక్ అందుకుంది. కాగా ఈ మూవీలో షారుఖ్ సరసన నటించే అవకాశం రావడం లక్కీగా ఫీల్ అవుతున్నానని, ఆయనతో స్క్రీన్ షేరింగ్ అద్భుతమై ఫీలింగ్ కలిగిందని తాప్సీ చెప్పింది. తామిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుందిరిందని చాలా మంది ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉందని, అలాగే సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపింది.
ఇది కూడా చదవండి : TSPSC Group-2 : తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ పై గందరగోళం.. వాయిదా వేయక తప్పదా?
అలాగే తన లవ్ ఎఫైర్ గురించి కూడా మాట్లాడిన నటి.. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే తాను ప్రేమలో పడ్డానని చెప్పింది. ‘నా సీనియర్ అయిన ఒక ఆబ్బాయి అటిట్యూడ్ బాగా నచ్చేది. అతనూ నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఈ క్రమంలో నేను అతనిపై ఇష్టం పెంచుకుంటున్న సమయంలోనే ఏమైందో తెలియదు నాతో మాట్లాడటం మానేశాడు. నన్ను కలిసేందుకు కూడా ఆసక్తి చూపలేదు. నా ఫ్రెండ్స్ ద్వారా అసలు విషయం తెలుసుకున్నా. నాతో ప్రేమ వ్యవహారం వల్ల తన చదువు దెబ్బతింటుదని, నాతో సమయం గడపడం వల్ల సరిగా దృష్టి పెట్టలేకపోతున్నానని బాధ పడుతున్నట్లు చెప్పాడు. దీంతో నేను కూడా అతనికి దూరంగా ఉడటం మొదలుపెట్టాను. క్రమంగా ఒకరికొకరం దూరమయ్యాం. విడిపోయే ముందు బాగా చదువుకొని లైఫ్‌లో సక్సెస్ కావాలని సలహా ఇచ్చాడు. అయితే ఆ వయసులో ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకపోవడంతో అతని ప్రేమ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. చాలా రోజులు అందులో నుంచి బయటపడలేకపోయా' అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది తాప్సీ.