/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-63-1-jpg.webp)
Marriage issue: స్టార్ నటి తాప్సీ పన్నూ తన పెళ్లి వార్తలపై స్పదించింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ చెక్కేసిన తాప్సీ వరుస సినిమాలతో అలరిస్తోంది. అక్కడ ఒకవైపు నటిగా, మరోవైపు నిర్మాతగానూ రాణిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లిపై రకరకాల రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. త్వరలోనే ప్రియుడు మథియాస్ బోతో తో పెళ్లిపీటలెక్కబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం నడుస్తుండగా.. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది తాప్సీ.
“People call me arrogant because I am very clear about what I like and what I don’t like. I am not an extremist. I can agree to disagree. I don’t think it’s very difficult to understand me as a person,” says our January 2024 cover star #TaapseePannu. ❤️
Photographs: Ajay Kadam… pic.twitter.com/jgnYvTf6CJ
— Filmfare (@filmfare) January 24, 2024
కొందరితో సన్నిహితంగా ఉన్నాను..
ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో మ్యారేజ్ గురించి మాట్లాడిన నటి.. ‘మథియాస్ బోతో కంటే ముందు నేను కొందరితో సన్నిహితంగా ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. అయితే మగవాళ్లందరూ గొప్ప వ్యక్తిత్వం ఉన్న పురుషులు కాలేరు. పరిణితి చెందిన వ్యక్తి మాత్రమే నాకు భద్రత కలిగించగలడని నమ్ముతాను. భావోద్వేగాల విషయంలో ఎక్కడా రాజీపడను. నా వ్యక్తిగత, వృత్తి జీవితంలో జరిగే మార్పులను పరిగణనలోకి తీసుకుని కాబోయే వాడిని ఎంచుకోవాలని, అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని ఫిక్స్ అయ్యాను' అంటూ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: CAA: ముస్లింలు భయపడొద్దు.. ఇస్లాంను చట్టం రక్షిస్తుంది: కేంద్ర హోంశాఖ
ఒత్తిడి చేయకూడదు..
అలాగే తనతోపాటు ఇతరుల పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఏం జరుగుతుందో చెప్పమంటూ ఒత్తిడి చేయకూడదని కోరింది. తానే పెళ్లి ప్రకటన చేస్తానని, ఎవరో ఒత్తిడి చేస్తున్నారనో.. రకరకాల వార్తలు వస్తున్నాయనో బహిర్గతం చేయనని తెలిపింది. 'పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన భాగం. దాని గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. నా రిలేషన్‌కు సంబంధించిన విషయాలను కూడా నేనేం దాచలేదు. సరైన సమయం వచ్చినప్పుడు అన్నిటి గురించి తెలుస్తుంది' అంటూ అని తనశైలిలో వివరించింది.