T20 World Cup : ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ.. ఆ రికార్డ్ అందుకున్న మూడో క్రికెటర్ గా హిట్ మ్యాన్! టీ20 వరల్డ్‌కప్ లో ఐర్లాండ్‌పై 52 పరుగుల వద్ద హిట్‌మ్యాన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా.. ఈ మ్యాచ్‌తో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 4,000 రన్స్ కొట్టిన మూడో బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. By Anil Kumar 06 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Rohit Sharma Rare Feet : టీ20 వరల్డ్‌కప్ లో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన పోరులో ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఐర్లాండ్‌పై 52 పరుగుల వద్ద హిట్‌మ్యాన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా.. ఈ మ్యాచ్‌తో అరుదైన ఘనత సాధించాడు. మూడో బ్యాట్స్ మెన్ గా.. పొట్టి ఫార్మాట్‌లో 4,000 రన్స్ కొట్టిన మూడో బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఘనతను విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం సాధించగా.. ఇక ఇప్పుడు వాళ్ళ సరసన రోహిత్ శర్మ సైతం చేరాడు. దీంతో T 20 ఫార్మాట్‌లో 4,000 రన్స్ క్రాస్ చేసిన మూడో బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ప్రస్తుతం విరాట్ 4,038 రన్స్‌తో అగ్రస్థానంలో ఉండగా.. బాబర్ 4,023 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. #rohit-sharma #2024-t20-world-cup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి