Virat: కోహ్లీ ఫామ్ పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. అలా చేయకూడదంటూ!

ఈ టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. విరాట్ ఫామ్‌పై ఆందోళన అక్కర్లేదని చెప్పాడు. రాబోయే మ్యాచుల్లో విరాట్ కీలకమవుతాడని, విరాట్ ఎన్నో విజయాలు అందించాడని గుర్తు చేశాడు.

New Update
Virat: కోహ్లీ ఫామ్ పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు.. అలా చేయకూడదంటూ!

Sunil Gavaskar About Virat Kohli: టీ 20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యా్ఖ్యలు చేశాడు. విరాట్ ఫామ్‌పై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పాడు. రాబోయే మ్యాచుల్లో విరాట్ కీలకమవుతాడని, ఇంకా అతడిలో చాలా క్రికెట్ మిగిలే ఉందన్నాడు. ఈ మేరకు గవాస్కర్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వరుసగా మ్యాచ్‌లను గెలవడమే ఏ ఆటగాడికైనా స్ఫూర్తి. దేశం కోసం ఆడేటప్పుడు గర్వపడుతూ ఆడాలి. విరాట్ కోహ్లీ భారత్‌ కోసం ఎన్నో విజయాలను అందించాడు. ఇప్పుడు మనం టోర్నీ (T20 World Cup 2024) తొలి దశలోనే ఉన్నాం. ఇంకా సూపర్ - 8, సెమీస్, ఫైనల్‌ ఉన్నాయి. కోహ్లీ కాస్త ఓర్పు పాటిస్తే మాత్రం తప్పకుండా మంచి ఇన్నింగ్స్‌లు ఆడతాడు' అని చెప్పాడు.

అలాగే వరుసగా మూడు మ్యాచుల్లో తక్కువ స్కోరుకే పరిమితమైనంత మాత్రాన ఒక బ్యాటర్ సరిగా ఆడలేదని కాదన్నాడు. కొన్నిసార్లు బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తారని, మంచి బంతులను ఎదుర్కొనే క్రమంలో బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుతుంటార అభిప్రాయపడ్డాడు. మనం పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. అతడిపై మనకు నమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటకు రావాలనేది కోహ్లీకి బాగా తెలుసని చెప్పాడు. ఇక గ్రూప్ స్టేజ్‌లో భారత్‌ చివరి మ్యాచ్‌ను ఫ్లోరిడా వేదికగా కెనడాతో జూన్ 15న ఆడనుంది.

Advertisment
తాజా కథనాలు