/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-63-1-jpg.webp)
T20 World Cup: క్రికెట్ ప్రియులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ 2024. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ ప్రపంచకప్ మొదలవనుంది. జూన్ రెండు నుంచి అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా మ్యాచ్‌లు మొదలవుతాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని దేశాలూ తమ జ్టలను ప్రకటించాయి. ఇండియా కూడా 15మందితో కూడిన జట్టను అనౌన్స్ చేసింది. ఇప్పుడు తాజాగా వరల్డ్‌కప్ మ్యాచ్‌లన్నింటినీ మొబైల్‌లో ఉచితంగా చూడొచ్చని చెబుతోంది డిస్నా ప్లస్ హాట్ స్టార్. మొబైల్ యాప్‌లో ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పింది. భారతదేశం మొత్తం ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుందని తెలిపారు డిస్నీ హాట్స్టార్ హెడ్ సజిత్ శివానందన్. దీని ద్వారా వరల్డ్‌కప్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామని చెప్పారు. ఇంతకు ముందు వన్డే వరల్డ్‌కప్‌ను కూడా ఇలాగే ఉచితంగా ప్రసారం చేశామని గుర్తు చేశారు. వన్డే ప్రపంచకప్ బారత్ , ఆస్ట్రేలియా మ్యాచ్‌ను మొబైల్స్ ద్వారా 5.9 కోట్ల మంది ఫ్రీగా చూశారు.
అంతకు ముందు టీమ్ ఇండియా అధికారిక కిట్ స్పాన్సర్ అడిడాస్ సోమవారం సోషల్ మీడియా ద్వారా అధికారిక T20 జెర్సీని ఆవిష్కరించింది. కొత్తగా రూపొందించిన జెర్సీ చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి మరియు గత కొన్ని ICC పర్యటనలకు భిన్నంగా ఈ జెర్సీ ఉంది. వెస్టిండీస్, అమెరికాలలో వచ్చే నెలలో జరగనున్న T20 ప్రపంచ కప్ 2024లో టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాకి బాధ్యతలు అప్పగించారు. కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది. సిరీస్‌లో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది.