Stadium Pitch Dismantle : టీ 20 వరల్డ్ కప్ (T20 World Cup) ను యూఎస్, వెస్టిండీస్ కలిపి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా (America) లో అన్ని క్రీడల్లాగే క్రికెట్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) చాలా చర్యలు తీసుకుంది. న్యూయార్క్‌లో జరిగే మ్యాచ్‌లను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేసింది.
యూఎస్ ఏకంగా న్యూయార్క్ (New York), నాసావు కౌంటీలోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో 34,000 మంది ప్రేక్షకులు వీక్షించేలా సరికొత్త టెంపరరీ స్టేడియం నిర్మించింది. దీనికి ఏకంగా రూ.250 కోట్లు ను ఖర్చు పెట్టింది. కానీ టీ20 వరల్డ్ కప్, అమెరికన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా మ్యాచుల్లో గ్యాలరీలు అన్ని ఖాళీగా కనిపించాయి. మ్యాచ్ టైమింగ్స్, డ్రాప్ ఇన్ పిచ్‌లు అమెరికన్స్‌లో ఆసక్తిని సన్నగిల్లేలా చేశాయి. పాక్- ఇండియా మ్యాచ్ టిక్కెట్ల ధరలు భారీగా ఉండటం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
న్యూయార్క్‌లోని నిర్మించిన స్టేడియం మొదటి మాడ్యులర్ స్టేడియం. అంటే దీన్ని తేలికగా వేరు చేయవచ్చు, మళ్లీ తిరిగి ఏర్పాటు చేయవచ్చు. డ్రాప్ ఇన్ పిచ్‌లను కూడా మరో చోటుకి తరలించి వినియోగించవచ్చు. టీ20 వరల్డ్ కప్‌లో చివరి మ్యాచ్ పూర్తయ్యాక, ఈ స్టేడియాన్ని డిస్‌మాంటిల్ చేసే అవకాశం ఉంది.
Also read:మామ హత్యకు కోడలు కోటి సుఫారీ.. కానీ ట్విస్ట్ ఏంటంటే!