Jasprit Bumrah : కోహ్లీ కాదు, రోహిత్‌ కాదు.. టీమిండియా టాప్‌ హీరో బుమ్రానే.. ఎలాగంటే?

టీ20 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్‌లో తెలివైన బౌలింగ్‌తో టీమిండియా గెలుపుకు ప్రధాన కారణమయ్యాడు బుమ్రా. డెత్‌ ఓవర్లలో అదిరే బౌలింగ్‌తో సౌతాఫ్రికాను నిలువరించాడు. అటు టోర్ని మొత్తం అద్భుతంగా బౌలింగ్‌ చేసిన బుమ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.

New Update
Jasprit Bumrah : కోహ్లీ కాదు, రోహిత్‌ కాదు.. టీమిండియా టాప్‌ హీరో బుమ్రానే.. ఎలాగంటే?

Team India : భారతీయులకు క్రికెట్‌ అంటే పిచ్చి.. అయితే ఇందులోనూ వివక్ష ఉంటుంది. ఇండియన్స్‌ సాధారణంగా బ్యాటింగ్‌ను ఇష్టపడతారు. అందుకే బౌలర్లకు ఫ్యాన్‌ బేస్‌ కూడా చాలా అరుదుగా ఉంటుంది. సెంచరీలు బాదినవాడు హీరోలగా కీర్తించపడతారు కానీ వికెట్లు తీసినవాడిని ఆ కాసేపు పొగిడేసి తర్వాత పెద్దగా పట్టించుకోరు. అందుకే టీమిండియా అభిమానులకు ధోనీ (Dhoni) ఓ హీరో కానీ.. ఆ ధోనీ 2011 వరల్డ్‌ కప్‌ గెలవడానికి కారణమైన జహీర్‌ఖాన్‌కు కనీసం క్రెడిట్లు కూడా ఇవ్వరు. ఇలాంటి మైండ్‌సెట్‌ మొదటి నుంచి ఉన్నదే అయినా ఆ ఆలోచనా తీరు ఇప్పటికైనా అవకాశం టీమిండియా ఫ్యాన్స్‌కు వచ్చింది. టీ20 వరల్డ్‌కప్‌-2024 (T20 World Cup 2024) ను టీమిండియా గెలుచుకోవడానికి అందరికంటే పెద్ద కారణం పేసర్ జస్ప్రిత్‌ బుమ్రా. అందుకే అతనికే ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు లభించింది.


ఇది బుమ్రాకే సాధ్యం:
సౌతాఫ్రికా (South Africa) గెలవాలంటే 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో క్లాసెన్, మిల్లర్‌ ఉన్నారు. అప్పటివరకు స్పిన్నర్లు అక్షర్, కుల్దీప్‌ యాదవ్‌ను క్లాసెన్‌ ఉతికి ఆరేశాడు. దీంతో భారత్‌ గెలుపు అసాధ్యంగానే అనిపించింది. ఈ స్టేజ్‌ నుంచి ఓ జట్టు ఓడిపోతుందని ఎవరూ కూడా అనుకోరు. ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ 'క్రిక్‌ఇన్ఫో'లో ఇండియా విన్నింగ్‌ ప్రడీక్షన్‌ 3శాతానికి పడిపోయింది. అంటే 100మందిలో కనీసం నలుగురు కూడా ఈ పరిస్థితిలో ఇండియా గెలుస్తుందని అనుకోలేదు. అయితే బుమ్రా అద్భుతమే చేశాడు. పదునైన బంతులు సంధిస్తూ రన్స్‌ను కట్టడి చేసిన బుమ్రా కీలకమైన సమయంలో మార్కో జెన్సన్‌ వికెట్‌ లేపేశాడు. అటు మిల్లర్‌, క్లాసెన్‌ను పాండ్యా అవుట్ చేయడంతో చివరి 5 ఓవర్లలో మ్యాచ్‌ అనూహ్య మలుపు తిరిగింది.


దిగ్గజాల సరసన..:
టీ20 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్‌లో నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు బుమ్రా (Jasprit Bumrah). డెత్‌ ఓవర్లలో బుమ్రా వేసిన రెండు ఓవర్లలో కేవలం ఆరు పరుగులే వచ్చాయి. ఇదే టీమిండియా గెలుపుకు ప్రధాన కారణమైంది. కేవలం ఈ ఒక్క మ్యాచ్‌లోనే బుమ్రా ఇలా వేయలేదు. ఈ టోర్ని మొత్తం బుమ్రా హవా కొనసాగింది. కీలకమైన సమయంలో వికెట్లు తీయ్యడం, మంచి ఎకానమీతో బౌలింగ్‌ చేయడం బుమ్రాకి సాధ్యమైనంతగా సమకాలీన క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకావడం లేదు. బ్యాటింగ్‌ పిచ్‌లపైనా సత్తా చాటుతుండడం బుమ్రా స్పెషాలిటీ. తన అద్భుత బౌలింగ్‌తో ఇప్పటికే దిగ్గజాలు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, వసీం అక్రమ్‌ లాంటి వారికి ఏ మాత్రం తీసిపోడని ఇప్పటికే నిరూపించుకున్న బుమ్రకు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం సెల్యూట్ చేస్తోంది.

Also Read: అప్పుడు శ్రీశాంత్, ఇప్పుడు స్కై..టీ20 వరల్డ్‌కప్‌ను ఇచ్చిన క్యాచ్

Also Read: విలన్ టు హీరో.. తిట్టిన నోర్లే మెచ్చుకుంటున్నాయి.. పాండ్యాకు ఫ్యాన్స్ ‘సారీ’ !

Advertisment
Advertisment
తాజా కథనాలు