T-BJP Chief Kishan Reddy: స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని.. ఈ కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో రాజకీయ నాయకులే కాదు.. సినీ నటులు, వ్యాపారులు కూడా ఉన్నారని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూల్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను దెబ్బ తీయడానికి ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపణలు చేశారు.
ALSO READ: చంద్రబాబుకు చెప్పే దమ్ముందా?.. మంత్రి బొత్స సవాల్
ట్యాపింగ్ సూత్రధారుడు కేటీఆర్..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో డబ్బులు పంపిణీ చేసినట్టు పోలీసుల విచారణలో అధికారులు ఒప్పుకున్నారన్నారు. పోలీసులే మిగతా పోలీసులపై చర్యలు తీసుకోవడం కష్టమని.. కేసులోని పలువురు నిందితులు సహచరులు కాబట్టి కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ కేసులో అసలు న్యాయం జరగదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో తనపై కిషన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని.. నార్కో టెస్ట్‌కు కూడా సిద్ధమని కేటీఆర్ ప్రకటించినప్పటికీ.. కిషన్ రెడ్డి మొత్తం వ్యవహారానికి కేటీఆరే కారణమని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.