Syria: సిరియాపై ఆగని ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. మరో పేద దేశంపై ప్రతాపం!

సిరియాపై ఇజ్రాయెల్‌ దాడులను ఆపడంలేదు. ఓవైపు గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం ఇటు సిరియాపైనా దాడులు కొనసాగిస్తోంది. డమాస్కస్‌లోని సైనిక ప్రదేశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక సిరియన్ సైనికుడు మరణించాడు.

New Update
Syria: సిరియాపై ఆగని ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. మరో పేద దేశంపై ప్రతాపం!

ఓవైపు బాంబులతో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ మరోవైపు సిరియాపైనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఐదు రోజుల క్రితం (జున్ 9) సిరియాలోని బనియాస్ నగరానికి సమీపంలో ఉన్న సైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దళాలు వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దెబ్బ నుంచి సిరియా ఇంకా కోలుకోకముందే మరోసారి ఇజ్రాయెల్‌ సైనికులు రెచ్చిపోయారు. సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది.


తిప్పికొడుతున్నాం...:
డమాస్కస్‌లోని సైనిక ప్రదేశాలు, నివాస భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఒక సిరియన్ సైనికుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారని సిరియా సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి దాడులు జరిగాయని సిరియా సైన్యం ప్రకటించింది. అటు డమాస్కస్ గ్రామీణ ప్రాంతంలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తమ సైన్యం తిప్పికొట్టినట్టుగా సిరియా చెబుతోంది.


ఈ రెండు దేశాలకు ఎందుకు గొడవ?
ఇజ్రాయెల్ , సిరియా మధ్య వైరుధ్యం 1967 నాటి నుంచి ఉంది. అప్పడు జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌ పైచేచి సాధించింది. సిరియా నుంచి గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ ఆనాడే స్వాధీనం చేసుకుంది. 1973లో యోమ్ కిప్పూర్ యుద్ధంలో ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియన్ దళాలు విఫలయత్నం చేశాయి. 1974లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ , గోలన్ హైట్స్‌లో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉండిపోయింది. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్, సిరియాల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎందుకంటే అప్పుడు సిరియాకు ఇరాన్‌ మద్దతుగా నిలిచింది. ఇది ఇజ్రాయెల్‌కు నచ్చలేదు. ఇక సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ పాలనకు మద్దతుగా ఆయుధాలు, డబ్బు, యోధులను ఇరాన్‌ అందిస్తూ వస్తోంది.

Also Read: దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. 300 మంది..!

Advertisment
Advertisment
తాజా కథనాలు