Paris Olympics: శరణార్ధి నుంచి పారిస్ ఒలింపిక్స్ వరకూ..స్విమ్మర్ యుస్రా జర్నీ పుట్టి పెరిగింది ఒక కల్లోలత ప్రాంతంలో..ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే దేశానికి వచ్చింది. అది కూడా సముద్రాన్ని ఈదుకుంటూ. శరణార్ధులుగా బెర్లిన్ చేరుకుంది. అక్కడ శరణార్దుల కోసం ఐఓసీ ప్రత్యేక జట్టుకు ఎంపిక అయి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న యుస్రా మర్దిని జర్నీ అందరికీ ఆదర్శప్రాయం. By Manogna alamuru 26 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Swimmer Yusra Mardini: యుస్రా మర్దిని..ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటోంది. 2016 రియో, ఆ తరువాత టోక్యోలో కూడా మెరిసిన ఈ స్విమ్మర్ విజయాల వెనుక పెద్ద స్టోరీనే ఉంది. ఈ అమ్మాయి అంది జీవితాల్లా సాగలేదు. ఒలింపిక్స్ లో పాల్గొనే ప్రతీ క్రీడాకారుడు/కారిణి జీవితాల వెనుక ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఉంటాయి. వారు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేుకుంటారు. కానీ యుసరా మర్దిని జీవితం మాత్రం అందరి కంటే డిఫరెంట్. శరణార్ధి జట్టులో ఒకరిగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న యుస్రా ఒకప్పుడు అసలు బతికుండడానికే చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. యుస్రాది కల్లోలిత ప్రాంతమైన సిరియా. మూడేళ్ల వయసు నుంచే ఈత కొట్టడం ప్రారంభించింది. ఆమె తండ్రి స్మిమ్మింగ్ కోచ్ కావడంతో ఆయన శిక్షణలోనే ఆరితేరింది. మర్దినితో పాటు ఆమె చెల్లి సారా కూడా ఈతలో శిక్షణ తీసుకుంది. జాతీయ స్థాయి పోటీల్లో మెడల్స్ కూడా సాధించింది. 2012లో సిరియాలో జరిగిన ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో సైతం పాల్గొంది. దాని తరువాత ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదిగో అప్పుడే ఆమె జీవితం మొత్తం తల్లకిందులు అయిపోయింది. సిరియాలో జరిగిన అంతర్యుద్ధంలో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయి నిరాశ్రయురాలు అయింది. చెల్లి ఒక్కతే మిగిలింది. ఆమెను కూడా యుస్రానే చూసుకోవాలి. వీరితో పాటూ ఇంకెంత మందిదో ఇదే పరిస్థితి. వారిలో ఓ 20 మంది కలిసి గ్రీసు బయలుదేరారు. వారిలో యుస్రా, సారా కూడా ఉన్నారు. తమ ఊరి నుంచి లెబనాన్, ఆ తర్వాత టర్కీ చేరుకున్నారు. టర్కీ నుంచి గ్రీసుకి పడవలో బయలుదేరారు. ఆ పడవ సామర్థ్యం 20 మందికి మాత్రమే. దానికి మించి ఎక్కారు. అధిక భారం వల్ల అది ఏక్షణంలోనైనా మునిగిపోయేలా ఉంది. దీనికి తోడు మార్గమధ్యంలో తీవ్ర గాలులు, రాకాసి అలలు సవాలుగా మారాయి. దీంతో పడవ మునిగిపోవడం మొదలయింది. అయితే ఈత వచ్చిన యుస్రా.. తన చెల్లి సారాతో పాటు ఈత వచ్చిన మరొక వ్యక్తి సముద్రంలోకి దూకారు. తాము ఈత కొడుతూ పడవను ముందుకు నడిపించారు. సముద్రంలో ఈత చాలా కష్టం. కానీ ఇతరుల ప్రాణాలు కాపాడ్డానికి వారలా చేశారు. ఉప్పు నీటికి కళ్లు మండుతున్నా.. శరీరం నీరసించిపోతున్నా.. పడవను మాత్రం ఒడ్డుకి చేర్చేంతవరకు ఈత కొడుతూనే ఉన్నారు. అలా గ్రీసు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నడక, బస్సు, రైలు ద్వారా జర్మనీలోని బెర్లిన్ చేరుకున్నారు. బెర్లిన్‌లోని శరణార్థుల శిబిరంలో తలదాచుకున్న యుస్రా , సారా తలదాచుకున్నారు. అయితే యుస్రాకు ఒలింపిక్స్ కల మాత్రం పోలేదు. ఆమె ఒలింపిక్స్ కల ఎప్పటికీ నెరవేరదన్న దిగులు ఎక్కువైంది. అదే సమయంలో అక్కడి ఓ స్థానికుడు మర్దిని గురించి తెలుసుకొని స్థానిక కోచ్‌కి పరిచయడం చేశారు.దీంతో మరోసారి స్విమ్మింగ్‌పూల్‌లో అడుగుపెట్టింది యుస్రా. తన నైపుణ్యంతో కోచ్‌ను ఆశ్చర్యపర్చారు. అయితే కాంగో, సూడాన్, సిరియా వంటి కల్లోలిత ప్రాంతాల నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొచ్చిన వారిలో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులుండటం గమనించింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ). శరణార్థుల ఆశలకు వారు ప్రతినిధులుగా నిలబడాలనే ఉద్దేశంతో ఐఓసీ.. 2016 రియో ఒలింపిక్స్‌లో శరణార్థుల కోసం ప్రత్యేక జట్టుని ఏర్పాటు చేసింది. అలా తన నైపుణ్యంతో ఆ జట్టుకు ఎంపికైంది. అప్పటికి ఆమె వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. 2016లో టైమ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత ప్రతిభావంతులైన 30 మంది టీనేజర్లలో ఒకరిగా స్థానం సంపాదించింది యుస్రా. దాంతో పాటూ వివిధ దేశాల్లో శరణార్థులైన వారి సంరక్షణ, భద్రత కోసం ఏర్పాటైన సంస్థ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్‌కు కూడా గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైంది. దీంతో అతిచిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది. 2018లో ఈమె కథ గురించి చెబుతూ ఓ పుస్తకం కూడా విడుదలైంది. 2022లో ‘ది స్విమ్మర్స్’ పేరిట ఆమె బయోపిక్ విడులైంది. 2023లో టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన అత్యంత 100 మంది ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే ఒలిపింక్స్‌లో యుస్రా ఇప్పటి వరకు మెడల్ సాధించలేదు. ప్రస్తుతం ఇదే టార్గెట్‌గా యుస్రా మరోసారి పూల్‌లోకి దిగుతోంది. Also Read:National: ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా..ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 #2024-paris-olympics #swimmer #yusra-mardini మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి