Movies:సూర్య కంగువా మూవీ క్రేజీ రికార్డ్...38 భాషల్లో సినిమా విడుదల

విడుదలకు ముందే సూర్య నటిస్తున్న కంగువా సినిమా రికార్డ్ లను సృష్టిస్తోంది. కంగువాను 38 భాషల్లో రిలీజ్ చేస్తున్నామని మూవీ నిర్మాత ప్రకటించారు. అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.

New Update
Movies:సూర్య కంగువా మూవీ క్రేజీ రికార్డ్...38 భాషల్లో సినిమా విడుదల

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న కంగువా. బాహుబలిలా ఇదొక రాజుల మూవీ అని తెలుస్తోంది. ఇప్పుడు దీని గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెలకెక్కుతున్న కంగువీ సినిమాను ఏకంగా 38 భాషల్లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. ఈ విషయాన్ని నిర్మత జ్ఞానవేల్ రాజా స్వయంగా ప్రకటించారు. కంగువా మూవీ సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది.

Also Read:అరుదైన మిల్కీ వే గెలాక్సీ ఫోటో తీసిన జేమ్స్ వెబ్ టెలీస్కోప్

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ భారీ రెస్పాన్స్ అందుకుంది. దాంతో పాటూ సినిమాపై ఎక్కడలేని అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్య మేకోవర్ అండ్ గెటప్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాపై సౌత్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కంగువా సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది.

కంగువీను 38 భాషల్లో రిలీజ్ చేయడమే కాకుండా ఐమాక్స్, త్రీడీ వెర్షన్ లోనూ అందుబాటులోకి తెస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండబోతోందన్నా జ్ఞానవేల్ రాజా. ఈ విషయం విన్న సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదే కనుక నిజమైతే పాన్ వరల్డ్ స్థాయిలో అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో సూర్య ఏకంగా ఆరు విభిన్న తరహా అవతారాల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయని అంటున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే జగపతిబాబు, యోగి బాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కంగువా మూవీ గురించి మరో హైలెట్ ఏంటంటే దీన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు