South Africa Player SuryaKumar Yadav) : గతేడాది టీ20ల్లో పరుగులు వరద పారించిన ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు వచ్చిన బ్యాటర్ సూర్యభాయ్ (Suryakumar Yadav). టీ20ల్లో అద్భుతంగా రానించడంతో అతడికి వన్డేల్లోనూ ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ. అయితే వన్డే ఫార్మెట్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అందివొచ్చిన అన్నీ అవకాశాలను చెడగొట్టుకున్నాడు. సంజూ శాంసన్ ఎంత బాగా ఆడుతున్నా అతడిని పక్కనపెట్టి సూర్యకుమార్‌కు ఛాన్సులు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌కూడా సైతం సూర్యను సెలక్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు సెలెక్టర్లు. వరల్డ్‌కప్ గ్రూప్ మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై హార్దిక్‌పాండ్యా గాయపడడంతో తుది జట్టులోకి వచ్చిన ఈ మిస్టర్ 360డిగ్రి ఆటగాడు ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ ఫేయిల్ అయ్యాడు. ముఖ్యంగా ఫైనల్‌లో అత్యంత చెత్త బ్యాటింగ్‌చేసిన సూర్యని ఇప్పటికీ అభిమానులు తిట్టుకుంటున్నారు. అయితే తనకు బాగా సెటైన టీ20ల్లోనూ సూర్యకుమార్ స్థానం కోల్పోతాడానన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చివరి రెండు మ్యాచ్‌లు తుస్సు:
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సూర్యకుమార్ చివరి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. ఒక మ్యాచ్‌లో ఒక పరుగు చేస్తే.. మరో మ్యాచ్‌లో కేవలం 5పరుగులే చేశాడు. మొదటి మూడు మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఇక డిసెంబర్ 10నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌కు సూర్యకుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో ఫ్లాప్ అయితే సూర్యపై మరిన్ని విమర్శలు వ్యక్తమవుతాయి. నిజంగా టీ20ల్లో సూర్య ఇప్పటీకి నంబర్-1 ప్లేయరే. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడనంతా మాత్రానా అతడిని విమర్శించడానికి లేదు. అయితే ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా.. వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి సూర్య ఏ ఒక్కసారి సరిగ్గా ఆడకపోయినా తిట్టిపోస్తున్నారు.
WATCH:
కెప్టెన్‌గా ఫిట్టా?
కెప్టెన్‌గా సూర్యకుమార్ ఫిట్టా.. కాదా అన్నదానిపై చర్చ జరుగుతోంది.. వచ్చే ఏడాది(2024) టీ20 వరల్డ్‌కప్ ఉండడంతో ఈ డిస్కషన్ జరుగుతోంది. నిజానికి రోహిత్ ఆడని మ్యాచ్‌ల్లో పాండ్యా కెప్టెన్సీ చేయాల్సి ఉంది. కానీ గాయం కారణంగా పాండ్య ఆడడంలేదు. దీంతో సూర్యకు ఆ అవకాశం లభించింది. కెప్టెన్సీ్ చేసిన తొలి సిరీస్‌లో సూర్య కెప్టెన్సీ పర్వాలేదనిపించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది టీమిండియా. దీంతో అతడని ఫ్యూచర్‌లో కెప్టెన్సీకి ఫ్రవర్ చేయవచ్చా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు. పలువురు మాజీలు సూర్య కెప్టెన్సీకి పనికిరాడని నేరుగా చెప్పేస్తున్నారు.
Also Read: కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ డబ్బులు సంపాదించిన ప్లేయర్ ఇతనే!