IPL2024: ముంబయి ఇండియన్స్ జట్టుకు మిస్టర్ 360 దూరం! ఐపీఎల్ 2024 మరోమూడు రోజులలో ప్రారంభం కానున్న దశలో ముంబయి జట్టు కీలక ఆటగాటు సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టాడు. హార్ట్ బ్రోకెన్ సింబల్ తో పెట్టిన పోస్ట్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. By Durga Rao 19 Mar 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మరి కొద్ది రోజులలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొన్ని జట్లకు సంబంధించిన ప్రధాన ఆటగాళ్లు గాయాల కారణంగా ఆటకు దూరమవుతున్నారు. తాజాగా టీమిండియా మిస్టర్ 360 గా పిలవబడే సూర్యకుమార్ యాదవ్ ప్రముఖ ఎక్స్ ద్వారా పెట్టిన బ్రోకేన్ హార్ట్ ఇమేజ్ ఇప్పుడు ముంబయి జట్టు అభిమానులను కలవరపెడుతుంది.సూర్య పరోక్షంగా ఐపీఎల్ 2024 లో పాల్గొన లేదని సంకేతాలు ఇచ్చాడు. సూర్య పెట్టిన సందర్భాన్ని చూస్తే ఇది నిజమని తెలుస్తుంది. గత కొంత కాలంగా గాయాలు బెడదతో సూర్య క్రికెట్ కు దూరమైయాడు. రీసెంట్ సర్జరీ చేయించుకుని ఎన్ సీఏ పర్యవేక్షణలో ఉన్నాడు. ఐపీఎల్ ఆడాలంటే ఎన్ సీఏ నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా ఎన్ సీఏ సూర్యాకు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించనట్లుంది. అందుకే అతను సోషల్ మీడియా వేదిక గా తన బాధను బహిర్గతం చేసి ఉండోచ్చు. ఇటివలె రిషబ్ పంత్ ,శ్రేయాస్ అయ్యర్, కేెెెఎల్ రాహాల్ కు ఎన్ సీఏ ఎన్ ఓసీ ఇచ్చింది. కాని సూర్య విషయంలో ఎన్ సీఏ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఐపీఎల్ కు మరో 3 రోజుల గడువు మాత్రమే ఉండటంతో సూర్య పెట్టిన పోస్ట్ తో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంసం గా మారింది. ఒకవేళ ఎన్ సీఏ సూర్యకుమార్ యాదవ్ కు ఎన్ ఓసీ ఇవ్వకపోతే సీజన్ మొత్తం దూరంగా ఉంటాడా? లేక తొలి దశ మ్యాచ్ ల వరకు మాత్రమే దూరంగా ఉంటాడా అనేది వేచి చూడాలి. మార్చి 24 న అహ్మాదాబాద్ వేదిక గా గుజరాత్ టైటాన్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. #ipl #surya-kumar-yadav #heartbroken మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి