దేశంలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. మూడోసారి అధికారంలోకి వచ్చేంది మోదీ సర్కార్ ప్రయత్నిస్తుంటే…ఈ సారి ఎలాగైనా బీజేపీ గద్దె దించాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలే చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరిగితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష భారత కూటమిపై భారీ ఆధిక్యం పొందవచ్చని పలు సర్వేలు వెల్లడించాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 265 స్థానాలకు సంబంధించి ఫలితాలను విడుదల చేశాయి. ఈ సర్వేలో అన్ని ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఫలితాలను వెల్లడించాయి.
పూర్తిగా చదవండి..ఇప్పటికిప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారో తెలుసా? తేల్చేసిన సర్వేలు..!!
ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరిగితే...మోదీ హవా కొనసాగుతుందని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష కూటమి ఇండియా కంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భారీ ఆధిక్యం సాధిస్తుందని వెల్లడయ్యింది.

Translate this News: