Health Tips : మంచి లుక్ కోసం ఇలాంటి పనులు చేస్తే డేంజర్!

ఈ మధ్యకాలంలో శరీర ఆకృతి కోసం ఎన్నో ప్రయత్నాలు, శస్త్రచికిత్సలను చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఈ శస్త్రచికిత్సతో అనేక దుష్ప్రభావాలతోపాటు ఇన్ఫెక్షన్, రక్తస్రావం నొప్పి, వాపు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

New Update
Health Tips : మంచి లుక్ కోసం ఇలాంటి పనులు చేస్తే డేంజర్!

Surgery For Body :శరీర ఆకృతి (Body Shape) ని పొందాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. ఈ మధ్యకాలంలో ఎంతో మంది శరీర ఆకృతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొందరైతే శస్త్రచికిత్సలను చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియ వలన ఆరోగ్యానికి (Health) చాలా ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేటికాలంలో శరీర ఆకృతిని మెరుగుపరుచుకునే విధానం బాగా ప్రాచుర్యం పొందింది. మీరు కూడా శరీర ఆకృతి పూర్తి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. దానితో సంబంధం ఉన్న నష్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. బాడీ కాంటౌరింగ్ పొందే ముందు 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని నిపుణుల సలహా ఇస్తుంది. ఆ విషయాలు ఎంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

సర్జికల్ రిస్క్‌లు:

  • శరీర ఆకృతి అనేది ఒక శస్త్రచికిత్సా విధానం. దీనిలో శరీరంలోని కొన్ని భాగాల నుంచి కొవ్వు తొలగిస్తారు. దీంతో చర్మం బిగుతుగా ఉంటుంది. ఈ శస్త్రచికిత్సలో అనేక దుష్ప్రభావాలతోపాటు ఇన్ఫెక్షన్, రక్తస్రావం,  నొప్పి, వాపు చాలా రోజులు ఉంటుంది.

అనస్థీషియా ప్రమాదాలు:

  • శస్త్రచికిత్స సమయంలో అనస్థీషియా (Anesthesia) ఇస్తారు. దీని కారణంగా అపస్మారక స్థితికి వెళ్తారు. నొప్పి కూడా వస్తుంది. అనస్థీషియాకు అలెర్జీ ప్రతిచర్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపోటు పడిపోవడం వంటి నష్టాలు ఉన్నాయి. ఈ సమస్యలు కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు.

శస్త్రచికిత్స తర్వాత సమస్యలు:

  • శస్త్రచికిత్స తర్వాత రికవరీ సమయం చాలా ముఖ్యం. ఈ సమయంలో విశ్రాంతి అవసరం. అయితే గాయం సరిగా మానకపోవడం, చర్మం అసమానంగా ఉండటం, వాపు వంటి కొన్ని సమస్యలు సంభవించవచ్చు. కొన్నిసార్లు శరీర ఆకృతి ఫలితాలు ఆశించిన విధంగా ఉండవు. ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.

దీర్ఘకాలిక ప్రభావాలు:

  • చర్మంపై మచ్చలు, శరీరంలో వాపు, అసమాన స్కిన్ టోన్ వంటి శరీర ఆకృతికి సంబంధించిన కొన్ని ప్రభావాలు ఎక్కువ రోజులు ఉండవచ్చు. శస్త్రచికిత్స తర్వాత జీవనశైలిలో మార్పులు చేయకపోతే బరువు పెరిగి (Weight Gain) మళ్లీ సమస్యలను కలిగిస్తుంది.

ఫైనాన్షియల్ బర్డెన్:

  • శరీర ఆకృతి ప్రక్రియలు ఖరీదైనవి. ఇందులో ఉండే అన్ని ఖర్చుల వలన మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అంతేకాదు కొన్ని కారణాల వల్ల ఫలితాలు సరిగ్గా రాకపోతే మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుంది. ఇది ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read : వరదల్లో బోట్ల దందా.. రూ.1500 నుంచి 4 వేలు వసూలు

Advertisment
తాజా కథనాలు