LPG Cylinder War : రూ.900 పెంచి రూ.100 తగ్గించాడు.. మోదీది ఎలక్షన్ స్టంటేనని ప్రతిపక్షాలు ఫైర్! మహిళా దినోత్సవం సందర్భంగా గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అయితే బీజేపీ 10ఏళ్ల పాలనలో సిలిండర్ ధర రూ.900 పెరిగిందని.. ఇప్పుడు ఎన్నికల ముందు రూ.100 తగ్గించారని మోదీపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. By Trinath 08 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి BJP vs Congress Over LPG Cylinder Price : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గర పడుతున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఎన్నికలకు ముందు వరాలు కురిపించడం అధికార పార్టీకి అలవాటే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అలానే చేస్తుంది. బీజేపీ కూడా అంతే చేసింది. ఎన్నికలకు ఒక నెల ముందు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ మోదీ కీలక ప్రకటన చేశారు. మహిళ దినోత్సవం సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. అయితే మోదీ పాలనలో ఇది పదో మహిళా దినోత్సవం. సరిగ్గా ఎన్నికల ముందు మహిళ దినోత్సవం నాడే మోదీ ఈ ప్రకటన చేయడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇది ఎలక్షన్ స్టంట్‌గా అభిప్రాయపడుతున్నాయి. కోట్ల మందికి మేలు.. కానీ: మహిళా దినోత్సవం(Women's Day) సందర్భంగా గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.100(Gas Cylinder Rs.100/-) తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) ప్రకటించారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆర్థికంగా లబ్ధి పొందనున్నారు. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై NCP ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించడం రాజకీయమేనని, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమర్శించారు. 9 ఏళ్లుగా అధికారంలో ఉన్నా ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా ఎందుకు ఆలోచించలేదు? ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయో మరి అప్పుడే ఇలాంటివి ఎందకు ప్రకటిస్తున్నారని నిలదీశారు. అప్పుడు రూ.430 ఉండేది కదా: తమ ప్రభుత్వంలో సిలిండర్ ధర రూ.430 ఉండేదని 2014కు ముందు ధరను ప్రస్తావించారు సుప్రియా సూలే. ఇక అటు కాంగ్రస్(Congress) నేతలు సైతం మోదీ(PM Modi) పై మండిపడుతున్నారు. 9ఏళ్లలో 900 రూపాయలు పెంచిన బీజేపీ.. ఎన్నికల ముందు 100 రూపాయలు తగ్గించిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై రూ.300 సబ్సిడీని మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రకటించిన మరుసటి రజే ఎల్‌పీజీ ధరలపై రూ.100 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. Also Read : మహిళా దినోత్సవం రోజున మహిళలకు గుడ్ న్యూస్.. సిలిండర్ పై రూ. 100 తగ్గింపు! #bjp #narendra-modi #lpg-gas-cylinder-price-drop #supriya-sule #election-stunt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి