Supreme Court Verdict on Chandrababu Naidu's plea in Skill Development case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తనపై ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(CID) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ(జనవరి 16) తీర్పు వెలువరించనుంది. గతేడాది(2023) అక్టోబర్ 17న తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ అనిరుద్ధ బోస్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు తీర్పును వెలువరించనుంది.
స్కిల్ స్కామ్ కేసులో కీ పాయింట్స్, టైమ్‌లైన్:
➡ జులై 26, 2018 - అమల్లోకి వచ్చిన పీసీ చట్టంలోని సెక్షన్ 17ఏ
➡ డిసెంబర్ 9, 2021- స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్
➡ సెప్టెంబర్ 7, 2023- చంద్రబాబును నంబర్-37 నిందితుడుగా చేర్చిన CID
➡ సెప్టెంబర్ 9, 2023- ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ
➡ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. ఆపై ఐదు సార్లు రిమాండ్ పొడిగింపు
➡ రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్‌లో ఖైదీ నెంబర్ 7691గా 52 రోజులు ఉన్న చంద్రబాబు.
➡ ఏపీ హై కోర్టులో బాబు క్వాష్ పిటిషన్
➡ సెప్టెంబర్ 13, 2023- క్వాష్ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు
➡ సెప్టెంబర్ 19,2023- వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్లు హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా.. సీఐడీ తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ
➡ సెప్టెంబర్ 22, 2023- స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు.
➡ సెప్టెంబర్ 23, 2023- క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు బాబు లాయర్లు
➡ సెప్టెంబర్ 25,2023- చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్.. మర్నాడు మెన్షన్ చేయాలన్న సీజేఐ
➡ సెప్టెంబర్ 26, 2023: సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకు వాయిదా
➡ జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్‌వీఎన్ భట్‌ల ధర్మాసనం ముందుకు క్వాష్ పిటిషన్
➡ ట్విస్ట్ ఇస్తూ ధర్మాసనం నుంచి వైదొలగిన భట్
➡ మరోసారి సీజేఐ చంద్రచూడ్ ముందుకు అత్యవసరంగా తీసుకెళ్లిన బాబు లాయర్ లూథ్రా
➡ అక్టోబర్ 3కి క్వాష్ పిటిషన్ వాయిదా
➡ అక్టోబర్ 3, 2023- జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్
➡ అక్టోబర్ 9,10, 13 తేదీల్లో వాడీవేడీ వాదనలు
➡ అక్టోబర్ 13, 2023- స్కిల్ పిటిషన్‌కు తోడైన ఫైబర్ గ్రిడ్ కేసు పిటిషన్
➡ స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్
➡ నవంబర్ 9,203- ఫైబర్ గ్రిడ్ పిటిషన్‌పై విచారణ చేస్తూ.. స్కిల్ స్కాం కేసుతో విచారిస్తామన్న కోర్టు
➡ దసరా, దీపావళి సెలవులు దృష్ట్యా విచారణ వాయిదా
➡ అక్టోబర్ 31,2023- షరతులతో కూడా మధ్యంతర బెయిల్ మీద జైలు నుంచి బయటకు చంద్రబాబు
➡ మొత్తం 52 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు
➡ నవంబర్ 20,2023- క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం బెంచ్
➡ నవంబర్ 20,2023- షరతులతో బాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
➡ జనవరి16- క్వాష్ పిటిషన్ పై తీర్పు
అసలు స్కిల్ స్కాం కేసు ఏంటీ..?
➡ రూ.371 కోట్ల కుంభకోణం
➡ షెల్ కంపెనీల ద్వారా రూ.241 కొల్లగొట్టారని చంద్రబాబుపై ఆరోపణ
➡ 2017-18లో నకిలీ ఇన్వాయిస్‌లతో అవినీతి బాగోతం ఉందని చర్చ
➡ చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి అంటోన్న ఏపీ సీఐడీ కేసు
➡ కొల్లగొట్టిన వందల కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు చంద్రబాబుపై ఆరోపణలు
➡ బ్యాంక్ స్టేట్ మెంట్లు , రికార్డులు కోర్టుకు సమర్పించిన ఏసీబీ
➡ చంద్రబాబుపై 120(బి), 166, 167, 418, 420, 465, 468, 201, 109 ..
➡ రీడ్ విత్ 34 అండ్ 37 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు.
➡ సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద బాబుకు నోటీస్ ఇచ్చిన సీఐడీ
➡ 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్సన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
Also Read: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ..!
WATCH: