Koratala Siva: క్రిమినల్ కేసులో కొరటాలకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు 'శ్రీమంతుడు' సినిమాకుగానూ కాపీ రైట్‌యాక్ట్ కేసులో దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ క్రిమినల్ కేసును దర్శకుడు ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇంకా ఈ కేసులో విచారణ జరపడానికి ఏమీ లేదని తెలిపింది. By srinivas 29 Jan 2024 in సినిమా క్రైం New Update షేర్ చేయండి Criminal case: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు కాపీ రైట్ కేసులో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్వాతి మ్యాగజైన్‌లో వచ్చిన తన కథను ‘శ్రీమంతుడు’ సినిమాగా తెరకెక్కించారంటూ శరత్ చంద్ర అనే రచయిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కొరటాల శివ క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని తీర్పు వెల్లడించింది. కాపీ రైట్‌యాక్ట్ కేసు.. ఈ ఆంశంపై సోమవారం విచారణ జరిపిన కోర్టు దర్శకుడిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు. తన కథను కాపీ కొట్టారని ఆరోపించిన రచయిత.. ఈ మేరకు కోర్టుకు ఆధారాలను సమర్పించారు. చిత్ర నిర్మాత ఎర్నేని రవి, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌లపై కాపీ రైట్‌యాక్ట్ కేసు నమోదు చేయాలని, ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదు చేయాలన్న కథ రచయిత శరత్ చంద్ర అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో శరత్ చంద్ర సమర్పించిన ఆధారాలను సైతం రచయితల సంఘం నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. ఇది కూడా చదవండి: Bibinagar: కోమటి రెడ్డి, సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్ డిస్మిస్ చేస్తాం.. ఈ మేరకు రచయితల సంఘం నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులనే సమర్థిస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో దర్శకుడు సవాల్ చేశారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఇంకా ఈ కేసులో విచారణ జరపడానికి ఏం లేదని స్పష్టం స్పష్టం చేసింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పింది. దీంతో కొరటాల శివ తరఫున న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సబంధించిన ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. #koratala-shiva #criminal-case #sarat-chandra #srimanthudu-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి