Supreme Court On Gyanvapi Mosque: జ్ఞానవాపిలో హిందువులు పూజలు చేసుకోవదానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారించింది. అలహాబాద్ కోర్టు (Allahabad Court) ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అక్కడ రెండు మతాలవాళ్లూ తమ ప్రార్ధనలు కొనసాగించాలని సూచించింది. ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా కొనసాగిస్తేనే మంచిదని చెప్పింది. హిందువుల పూజలు జరిగిన తర్వాతనే ముస్లింల ప్రార్ధనలు మొదలవుతాయి కనుక అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తే మంచిదని ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (Justice Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఫిబ్రవరి 26వ తేదీన జ్ఞానవాపి లో హిందవులు(Hindus) పూజలు చేసుకోవచ్చునంటూ అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 30 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం పూజలు(Pooja) నిర్వహించింది. అప్పటి నుంచి కాశీ విశ్వనాథ ట్రస్ట్(Kasi Viswanath Trust) అక్కడ పూజలు చేస్తోంది. హిందువులు రోజూ నేలమాళిగలో ఉన్న ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. అప్పుడే అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం గుడి, పూజలు అంటున్నారని పిటిషన్‌లో పేర్కొంది.
అంతకు ముందు జ్ఞానవాపి అంజుమన్ మసీదు జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ అలహాబాద్ కోర్టును ఆశ్రయించింది. దానిని హైకోర్టు తిరస్కరిస్తూ… పూజలు చేయడానికి అనుమతినిచ్చింది. ఇప్పుడు ఈ తీర్పునే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అంజుమన్ మసీదు కమిటీ. దీని మీద సుప్రీంకోర్టులో ఇవాళ ప్రధాన న్యాయమూర్తి డీవై యంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది.