CM Jagan: సీఎం జగన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

తన బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సీఎం జగన్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జగన్ కేసుల విచారణ లేట్ ఎందుకు అవుతుందని సీబీఐని ప్రశ్నించింది. విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది.

New Update
CM Jagan: సీఎం జగన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి జగన్ కు సుప్రీం కోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని, కేసుకు సంబంధించి విచారణను వేరే డిపార్ట్ మెంటుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ (Raghu Rama Krishna Raju) వేసిన పిటిషన్‌ ను సుప్రీం కోర్టువిచారణ చేపట్టింది. దీనిపై విచారించిన ధర్మాసనం.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ పిటిషన్‌ కొట్టి వేయాలని జగన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసినందుకే ఆయన బెయిల్‌ రద్దు పిటిషన్‌ వేశారు అని జగన్ తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

Also Read: ప్రాణ ప్రతిష్టకు ముందే దర్శనమిచ్చిన బాలరాముడి దివ్యరూపం

సుప్రీం కోర్టు ఏమందంటే..

రాజకీయ పరమైన అంశాల జోలికి పోవడం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. కేవలం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తాం అని స్పష్టం చేసింది. జగన్ కేసుల విచారణ జాప్యానికి కారణమేంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విచారణ జాప్యంలో తమకు సంబంధం లేదని సీబీఐ తెలిపింది. సీబీఐకి సంబంధం లేకపోతే వేరే ఎవరికీ ఉంటుందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ, జగన్ (CM Jagan) కలిసి కేసును జాప్యం చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ క్రమంలో ఏప్రిల్ మొదటి వారానికి విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

గతంలో కూడా..

సీఎం జగనే టార్గెట్ గా గతంలో కూడా ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్‌ బెయిల్‌ రద్దు చేసి, అక్రమాస్తుల కేసులపై విచారణ వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) కౌంటర్‌ దాఖలు చేసింది సిబీఐ దర్యాప్తు సంస్థ. దీనిపై విచారణ సీబీఐ (CBI) కౌంటర్‌ అనంతరం రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ… తెలంగాణ హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు ఎంపీ రఘురామ.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు