BREAKING: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్‌.. ఆఫీస్ ఖాళీ చేయాలని ఆదేశం!

కేజ్రీవాల్ పార్టీకి సుప్రీంకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. AAP ఆఫీస్‌ను జూన్ 15లోపు ఖాళీ చేయమని కోర్టు ఆదేశించింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన కార్యాలయాన్ని నిర్మించింది. ఇక కొత్త ఆఫీస్‌ కోసం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోర్టు తెలిపింది.

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌‌కు సుప్రీం కోర్టు ఝలక్
New Update

Supreme Court News: ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయమని కోర్టు ఆదేశించింది. ఆప్‌(AAP)కార్యాలయం రూస్ అవెన్యూ కోర్టు స్థలంలో నిర్మించారని కోర్టు చెప్పింది. కావాలంటే భూమి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దేశంలో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టుకుంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి కోర్టు అదనపు సమయం ఇచ్చింది. జూన్ 15 లోగా కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది.

కోర్టు భూమినే కబ్జా చేశారా?

కార్యాలయం కోసం మరొక ప్లాట్ కోసం ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. పార్టీ అభ్యర్థనపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన కార్యాలయాన్ని నిర్మించింది. దీనిపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఉన్న రూస్ అవెన్యూ ప్లాట్‌ను ఢిల్లీ హైకోర్టుకు కేటాయించారు. జిల్లా కోర్టుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఇలా చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలుచేశారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరని.. ఏ రాజకీయ పార్టీ అయినా భూమిని ఎలా కబ్జా చేస్తుందని ప్రశ్నించారు. కచ్చితంగా హైకోర్టుకు భూమిని తిరిగి ఇవ్వాలని తెలిపారు.

ఈ భూమిని ప్రజా పనుల కోసం ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చారని, ఇప్పుడు రాజకీయ కారణాలతో వాడుకుంటున్నారని ఢిల్లీ ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్‌డబ్ల్యూఏ ఖాద్రీకి కోర్టు తెలిపింది. ఈ భూమిని తిరిగి హైకోర్టుకు అప్పగించాలని చెప్పింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా ఉన్నారు.

Also Read: ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లని అసలు వదులుకోకూడదు.. నిజమైన లవర్స్‌ ఎలా ఉంటారంటే?

#supreme-court #arvind-kejriwal #aap
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe