CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌‌కు సుప్రీం కోర్టు ఝలక్

సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణను వెకేషన్‌ బెంచ్ తిరస్కరించింది. ఈ కేసుపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ప్రస్తుతం తీర్పు రిజర్వ్‌లో ఉందని బెంచ్ స్పష్టం చేసింది.

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌‌కు సుప్రీం కోర్టు ఝలక్
New Update

CM Kejriwal Bail Extension: ఎన్నికల ప్రచారం నేపథ్యంలో లిక్కర్ స్కాం కేసులో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని సీఎం కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టులో (Supreme Court) పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చెప్పట్టాలని కేజ్రీవాల్ తరఫు లాయర్ వాదనలు వినిపించగా.. పిటిషన్‌పై అత్యవసర విచారణను వెకేషన్‌ బెంచ్ తిరస్కరించింది. ఈ కేసుపై ఇప్పటికే చర్చలు జరిగాయని, ప్రస్తుతం తీర్పు రిజర్వ్‌లో ఉందని బెంచ్ స్పష్టం చేసింది.

కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ ఈరోజు విచారణ చేపట్టింది. గత వారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన బెంచ్ అత్యవసర విచారణ గురించి ఎందుకు ప్రస్తావించలేదని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కేజ్రీవాల్ తన పిటిషన్‌లో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కోరిన విషయం తెలిసిందే.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై (Money Laundering Case) మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసుపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరారు. సీఎం కేజ్రీవాల్ తరఫు వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు మే 10న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జూన్‌ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.

#cm-kejriwal #delhi-liquor-policy-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe