ఎమ్.ఫాతిమా బీవీ..ఈమె పేరు తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. న్యాయస్థానాల్లో మగవారు మాత్రమే ఉంటున్న రోజుల్లో...వారు మాత్రమే జడ్జిలు, సక్సెస్ ఫుల్ న్యాయవాదులు అవుతున్న నమయంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడమే కాకుండా సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఎదిగిన ఫాతిమా బీవీ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1927 ఏప్రిల్ 30న కేరళలో జన్మించిన ఫాతిమా 96 ఏళ్ళ నిండైన జీవితం గడిపారు. 1989లో ఈమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుయ్యారు.
చాలా చిన్న స్థానం నుంచి ఫాతిమా బీవీ ఎదిగి న్యాయమూర్తిగా ఎదిగారు. 1950ల్లో మొట్టమొదటగా బార్ కౌన్సిల్ గోల్డ్ మెడల్ సంపాదించుకున్నది కూడా వీరే. లోవర్ జ్యుడీషరీ...ఆతర్వాత జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, అక్కడ నుంచి సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టులో ఛీఫ్ జస్టిస్ గా ఫాతిమా ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకం. జడ్జిగా రిటైర్ అయిన తర్వాత ఫాతిమా 1992లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పని చేశారు. ఆ తర్వాత 1997-2001 మధ్య కాలంలో తమిళనాడు గవర్నర్ గా ఉన్నారు.
ఫాతిమా బీవీ మరణానికి చాలా మంది సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్వీట్లతో ఆమె మీద ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారు.