/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-61-2-jpg.webp)
Supreme Court On Kejriwals Plea: కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ (ED) అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 4గంటల పాటు కేజ్రీవాల్ ను విచారించిన అనంతరం అరెస్టు చేసింది. కాగా మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతోపాటు తదితరులను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Also Read:Kejiriwal: ఒకే గదిలో కేజ్రీవాల్, కవిత?
మరోవైపు మరికాసేపట్లో ఈయనను రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court )తరలించనున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టులో ప్రవేశపెట్టాక కవితలానే..కేజ్రీవాల్‌ను కూడా ఈడీ పదిరోజు కస్టడీకోరనుంది. ఒకవేళ కోర్టు కనుక ఆయనను కస్టడీకి ఇస్తే..కవితను, కేజ్రీవాల్‌ను ఇద్దరినీ కలిసి విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరోవైపు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిదింతుల జాబితాలో చేర్చనుంది ఈడీ. ఇదే కనుక జరిగితే దేశంలో ఒక పార్టీ మొత్తం ఒక కేసులో నిందితులుగా చేర్చడం ఇదే మొదటిసారి అవుతోంది.