MLC Kavitha Petition On ED Summons: సుప్రీంకోర్టులో ఎమమ్మెల్సీ కవిత పిటిషన్ వాయిదా పడింది. ఈ నెల 16కు వాయిదా వేశారు జస్టిస్ బేల ఎమ్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం. లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ కవిత పటిషన్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టు విచారణచేసింది. అయితే వచ్చే సోమవారం అబిషేక్ బెనర్జీ కేసులతో పాటూ కవిత కేసును కూడా విచారిస్తామని సుప్రీంకోర్టు ఇంతకు ముందే చెప్పింది. దీంతో సోమవారం విచారణ అయ్యాకనే కవిత పిటిసన్ మీద తుది విచారణ జరిపించాలని ఆమె తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. దాంతో పాటూ కేసుల్లో ఇచ్చిన ఆదేశాలతో పాటూ రికార్డులను కూడా పరీశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్‌ను ఫిబ్రవరి 16కు వాయిదా వేశారు.
Also Read: Free Current:ఉచిత విద్యుత్ పొందాలంటే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..స్పష్టం చేసిన కేంద్రం
డిల్లీ లిక్కర్ కేసులో తాము ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కవిత మాజరు కావడం లేదని ఈడీ (ED) కోర్టుకు తెలిపింది. అయితే ఈడీ సమన్లు తమకు అందడం లేదని కవిత తరుఫు లాయర్ కపిల్ సిబల్ చెప్పారు. ఒకవేళ అందినా అవి చట్టవిరుద్ధమని వాదించారు. గత విచారణలో కవితకు సమన్లు ఇంక ఇవ్వమని ఈడీ కోర్టుకు తెలిపిందని గుర్తు చేశారు. అయితే అలా ఇవ్వమని చెప్పింది ఒక్కసారికి మాత్రమేనని...ప్రతీసారి కాదని అన్నారు ఈడీ తరుఫు న్యాయవాది. ఇద్దరి వాదనలనూ విన్న ధర్మాసన్...ఫిబ్రవరి 16న అన్నింటి మీదా విచారిస్తామని తెలిపింది.
లిక్కర్ స్కాం ఎలా బయటపడింది?
ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని కేజ్రీవాల్ (Arvind Kejriwal) సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురితో ప్రభుత్వం కమిటీ వేసింది. మార్చి 2021లో ఈ కమిటీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని.. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం రూ.9,500కోట్లు పెరుగుతుందని సిఫార్సు చేసింది. నవంబర్ 2021లో లెఫ్టనెంట్ గవర్నర్ కొత్త పాలసీకి ఓకే చెప్పారు. అయితే నరేష్ కుమార్ కొత్త చీఫ్ సెక్రటరీగా వచ్చిన వెంటనే లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. కొత్త పాలసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ది చేకూరేలా విధానపరమైన మార్పులు చేశారని.. రూ.628కోట్ల అవినీతి జరిగిందని ఓ నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ఆధారంగా ఎల్జీ 2022జులైలో సీబీఐ (CBI) విచారణకు ఆదేశించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ ప్రతినిధిగా కీలకంగా వ్యహరించిన అరుణ్ పిళ్లై, మధ్యవర్తి సుకేశ్ చంద్రశేఖరన్ వంటి వారిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా విచారించారు. ఇందులో అప్రూవర్‌గా మారిన అరుణ్ పిళ్ళే (Arun Pillai) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ.