సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. స్టార్ నటుడు కమల్‌హాసన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా నేత దేవినేని అవినాష్‌తో పాటు కృష్ణ, మహేశ్ బాబు ఫ్యాన్స్ పాల్గొన్నారు. By srinivas 10 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ సినిమా New Update షేర్ చేయండి Superstar Krishna statue: దివంగత నటుడు, సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో (KDGO Park) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైకాపా నేత దేవినేని అవినాష్‌తో పాటు కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Thrilled to witness the unveiling of #SuperstarKrishna Garu's statue in Vijayawada today by Ulaga Nayagan Padmashri @ikamalhaasan Garu and the dynamic @DevineniAvi. A heartfelt tribute to a legendary icon! ❤️🌟 #SuperstarKrishnaStatue #MaheshBabu #SSKLivesON pic.twitter.com/O5ngSqGhDg — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) November 10, 2023 ఈ వేడుకకు దేవినేని అవినాష్ (Devineni Avinash) నాయకత్వం వహించగా.. 'ఇండియన్-2' సినిమా షూటింగ్ లో భాగంగా విజయవాడ వచ్చిన కమల్ విగ్రహావిష్కరణ తర్వాత మీడియాతో మాట్లాడలేదు. ఈ క్రమంలోనే షూటింగ్ నిమిత్తం విజయవాడ వచ్చిన కమల్ హాసన్ పెద్దాయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు అవినాష్. అలాగే తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, కృష్ణ వారసత్వంతో వచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) సినీరంగంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తండ్రి పేరు నిలబెడుతున్నారని కొనియాడారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహం ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్‌కు (CM Jagan) కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Also Read:ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు కేటీఆర్ రిప్లై.. ఆనంద్ జీ ఈ విషయం తెలుసా అంటూ ఇక గతేడాది నవంబర్ 15న కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా అభిమానులు, గ్రామస్థులు సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ జ్ఞాపకార్థం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, అల్లుడు సుధీర్ బాబు, సోదరుడు ఆదిశేషగిరిరావు, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, తదితరులు హాజరయ్యారు. Also Read: రవితేజను మాస్ మహారాజ అని ఫస్ట్ పిలిచిన డైరెక్టర్ ఎవరో తెలుసా? #kamal-haasan #superstar-krishna #statue #invented మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి