Super Star Krishna Birth Anniversary : ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 81 వ జయంతి వేడుకులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఘట్టమనేని ఫ్యామిలీ!

సూపర్ స్టార్ కృష్ణ 81 వ జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫిలిం నగర్ లోని సూపర్ స్టార్ కన్వెన్షన్ హాల్ నందు జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరు కానున్న సినీ ప్రముఖులు, అభిమానుల కోసం పద్మాలయా స్టూడియోస్, ఘట్టమనేని ఫ్యామిలీ కలిసి భోజనం ఏర్పాటు చేస్తున్నారు.

Super Star Krishna Birth Anniversary : ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 81 వ జయంతి వేడుకులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఘట్టమనేని ఫ్యామిలీ!
New Update

Super Star Krishna 81st Birth Anniversary Celebrations : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ 81 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఘట్టమమనేని కుటుంబ సభ్యుల ఆధ్వరంలో ఈ వేడుకలు జరగనున్నాయి. కాగా ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు బయటికొచ్చాయి.

Also Read : ఎంతకు తెగించార్రా!.. ‘పుష్ప 2’ కపుల్ సాంగ్ పై ఈ ఫన్నీ ట్రోల్ చూస్తే పడి పడి నవ్వుతారు!

దాని ప్రకారం.. మే 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన 81 వ జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫిలిం నగర్ లోని సూపర్ స్టార్ కన్వెన్షన్ హాల్ నందు జరగనున్నాయి. ఇక ఈ వేడుకలకు హాజరు కానున్న సినీ ప్రముఖులు, అభిమానుల కోసం పద్మాలయా స్టూడియోస్, ఘట్టమనేని ఫ్యామిలీ కలిసి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరోలు, నిర్మాతలు పెద్ద ఎత్తున హాజరు కానున్నట్లు సమాచారం.

ఇక హీరోగా దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15న గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణ మరణం ఆయన అభిమానులతో పాటు మహేష్ బాబుకు తీరని లోటును మిగిల్చింది.

publive-image

#super-star-krishna-81st-birth-anniversary
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe