ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్‌ను కొనుగోలు చేసింది. రూ.6.8 కోట్లకు హెడ్‌కు దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో హెడ్ అదరగొట్టిన విషయం తెలసిందే. ఇక టోర్నీలో కేవలం బ్యాటర్‌గానే కాకుండా ఫీల్డర్‌గా, బౌలర్‌గానూ రాణించాడు హెడ్. వేలంలో హెడ్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్ అతనికి వెల్కమ్ చెబుతూ ట్వీట్ చేసింది.
వరల్డ్‌కప్ ఫైనల్‌లో మ్యాచ్‌ను మలుపు తిప్పింది ట్రావిస్ హెడ్. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ సత్తా చూపించాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) 47 పరుగుల వద్ద ఔటైన తర్వాత ఇండియా ఏ దశలోనూ భారీ స్కోరు వైపు కదలలేకపోయింది. మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో రోహిత్ శర్మ క్యాచ్‌ను హెడ్ కళ్లుచెదిరే రీతిలో అందుకున్నాడు. బ్యాక్‌కి రన్నింగ్ చేస్తూ హెడ్(Head) అద్భుతమే చేశాడు. రోహిత్ ఔటైన తర్వాత వెంటనే శ్రేయస్ అయ్యర్ ఔట్ అవ్వడం.. ఇక ఆ తర్వాత రాహుల్ స్లోగా బ్యాటింగ్ చేయడం.. ఇండియా 240 పరుగులకే సరిపెట్టుకోవడంతో ఆసీస్ విజయం ఈజీ అయ్యింది. ఇక బ్యాటింగ్ లోనూ హెడ్ అదరగొట్టాడు. సెంచరీతో ఫైనల్ లో ఆస్ట్రేలియాను గెలిపించాడు. దీంతో SRH అతడిని కొనుగోలు చేసింది.
ALso Read: ఐపీఎల్ హిస్టరీలో నెవర్ బిఫోర్.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మహిళా ఆక్షనీర్!