KTR: దీనికి బాధ్యులు ఎవరో చెప్పండి.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్!

కోట్లాది రూపాయలు నష్టం జరిగిన సుంకిశాల ప్రమాదాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు కేటీఆర్. కాంట్రాక్టింగ్ ఏజెన్సీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టట్లేదని ప్రశ్నించారు. దీనికి బాధ్యులెవరో తెలపాలంటూ రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా అడిగారు.

MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు
New Update

Rahil gandhi: సుంకిశాల ప్రమాదంపై రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో నిస్పాక్షికంగా విచారణ జరిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు వెనుకంజ వేస్తుందని ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో, దీనికి బాధ్యులు ఎవరో తెలపాలంటూ రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా అడిగారు కేటీఆర్.

#rahul-gandhi #brs-mla-ktr #sunkishala-retaining-wall
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe