/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T143608.099.jpg)
Rahil gandhi: సుంకిశాల ప్రమాదంపై రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
So the Congress Govt in Telangana wants the people of the state to believe that this was a minor incident at #Sunkishala & not talk about it even though more than 75 Crores of exchequer money was lost !!!
What & Who is stopping the Telangana Govt from blacklisting the agency… pic.twitter.com/otqSmMANTF
— KTR (@KTRBRS) August 10, 2024
ఈ మొత్తం వ్యవహారంలో నిస్పాక్షికంగా విచారణ జరిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు వెనుకంజ వేస్తుందని ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో, దీనికి బాధ్యులు ఎవరో తెలపాలంటూ రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా అడిగారు కేటీఆర్.