/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-20T113814.349-jpg.webp)
Healthy Drinks : ఎండాకాలం వచ్చిందంటే చాలు రకరకాల శీతల పానీయాలు(Summer Drinks) తాగుతుంటారు. ఈ పానీయాలు శరీరంలో కేలరీలను మాత్రమే పెంచుతాయి. శరీరానికి ఎటువంటి ప్రయోజనాన్ని అందించవు. అయితే శరీరాన్ని చల్లబరచాలనుకుంటే, మీ జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలి. జీర్ణక్రియను వేగవంతం చేయడానికి.. మంచి పేగు ఆరోగ్యం, గట్ లో మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చాలా ముఖ్యం. దీని కోసం ఈ పానీయాలు సరైన ఎంపిక. వీటి ద్వారా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పులియబెట్టిన టీ
ఇది పేగు ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఈ తీపి, పుల్లని పానీయాన్ని అనేక విధాలుగా తయారు చేయవచ్చు. వేసవి(Summer) లో దీన్ని తాగితే జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే దీనిలోని పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
సత్తు పానీయం
వేయించిన శనగ పొడి(Chickpea Powder) తో తాయారు చేసే ఈ శీతల పానీయం శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాదు దీనిలో ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే సత్తు పానీయం తీసుకుంటే, అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జింజర్ లెమన్ ఐస్ డ్రింక్
అల్లం, నిమ్మరసం కలిపి తయారుచేసిన శీతల పానీయం తాగడం ద్వారా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఈ పానీయం కడుపులో హెవీగా ఉండడం, యాసిడిటీ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. వేసవిలో జింజర్ లెమన్ ఐస్ డ్రింక్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
కొబ్బరి నీరు
వేసవిలో మండే వేడి నుంచి శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయాలనుకుంటే, కొబ్బరి నీరు(Coconut Water) త్రాగటం చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Sindhi Koki Roti: అదిరిపోయే సింధీ కోకి రోటీ.. తప్పకుండా ట్రై చేయండి