AP Exams Postponed: ఏపీ విద్యార్థులకు అలర్ట్. నవంబర్ 14 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెటివ్ అసెస్ మెంట్ (SA-1)పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పరీక్షల షెడ్యూలులో మార్పులు చేస్తూ సర్కార్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మార్పు చేసినట్లు పేర్కొంది. నవంబర్ 14 నుంచి జరగాల్సిన పరీక్షలను నవంబర్ 24 నుంచి నిర్వహించున్నట్లు వెల్లడించింది. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 26 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
షెడ్యూలులో భాగంగా నవంబర్ 24,25 తేదీల్లో 10వ తరగతి కాంపోజిట్ తెలుగు పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని తరగతులవారికి నవంబర్ 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, స్మార్ట్ టీవీలు ఉన్నచోట మాత్రం టోఫెల్ పరీక్షను నిర్వహిస్తారు. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన వెయ్యి పాఠశాలలు 8,9 తరగతులకు కూడా నవంబర్ 28 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోస్టల్ జాబ్‌లకు నోటిఫికేషన్ రిలీజ్
ఇక పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నవంబర్ 10వ తారీఖుతో ముగిస్తుంది. అయితే రూ. 50 ఆలస్య రుసుముతో నవంబర్ 11 నుంచి 16 వరకు రూ. 200 లేట్ ఫీజుతో నవంబర్ 17 నుంచి 22 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో నవంబర్ 23 నుంచి 30 వరకు ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలల ప్రాధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎలాంటి పరిస్థితుల్లో గడువును పొడిగించే ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయస్సు 31.08.2023నాటికి 14ఏళ్లు నిండి ఉండాలని పేర్కొన్నారు.
ఈఏడాది ఏడు పేపర్లు:
ఇక ఈ ఏడాది పదోతరగత పరీక్షల్లో ఏడు పేపర్లు ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భౌతిక, రసాయశాస్త్రాలు కలిపి ఒక పేపర్ గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్ గా ఉండనుంది. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. రెండింటింలోనూ 17 చొప్పున మార్కులు ఉండనున్నాయి. రెండింటింలో కలిపి 35మార్కులు సాధిస్తే ఉత్తీర్ణ సాధించినట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ పేపర్లు యాథావిధిగా ఉండనున్నాయి. తెలుగు, హిందీలో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అతున్నారంటూ ప్రశ్నపత్రం విధానంలోనూ మార్పులు చేశారు.
ఆ ప్రశ్నలు తొలగింపు:
తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటివరకు ఉన్న ప్రతిపదార్థాలకు భావం రాసే ప్రశ్నలకు తొలగించాలరు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. పద్యంపై 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోప్రశ్నకు 2 చొప్పున మొత్తం 8 మార్కులు ఉంటాయి.
రెండో ప్రశ్నగా ఇప్పవరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8మార్కులు ఉండేవి. ఇప్పుడు గద్యాన్ని చదివి 4 ప్రశ్నలకు జవాబులు రాయాలి. దీనికి ఒక్కో మార్కుకు రెండు మార్కులు ఉంటాయి. హిందీలో విద్యార్థులు ఈజీగా పాస్ అయ్యే విధంగా క్వచ్చన్ పేపర్ ను మార్చారు. గతంలో ఉన్న బిట్ పేపర్ ను తొలగించారు. ఇప్పుడు అదే విధానాన్ని తీసుకువచ్చారు. 14 మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.