ఎన్నికలు సమీపిస్తుండటంతో సూళ్లూరుపేట వైసీపిలో వర్గ పోరు పురుడు పోసుకుంటుందా.. ?

సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయని తెలుస్తుంది. సూళ్లూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ఓ వర్గం తయారు కావడంతో పార్టీలో చీలిక ఏర్పడింది.

New Update
ఎన్నికలు సమీపిస్తుండటంతో సూళ్లూరుపేట వైసీపిలో వర్గ పోరు పురుడు పోసుకుంటుందా.. ?

-సుళ్లూరుపేట అసెంబ్లీకి కొత్తగా యంపి గురుమూర్తి పేరు తెరమీదకు వచ్చిందా..?
-ఎంపీ గురుమూర్తి పేరు తెరమీదకు రావడంతొ కిలివేటి అనుచురులు గుర్రుమీదున్నారా.. ?

సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయని తెలుస్తుంది. సూళ్లూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేకంగా ఓ వర్గం తయారు కావడంతో పార్టీలో చీలిక ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యే టికెట్ కు ఎసరు పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అంతా ఒక్కటై నియోజకవర్గంలో ఇన్చార్జిగా తిరుపతి ఎంపీ గురుమూర్తిని తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

రెండు ధఫాలు శాసనసభ్యులుగా ఉన్న కిలివేటి పార్టీ క్యాడర్ కాదని తమ కొత్త వర్గాన్ని తయారు చేసుకోని వారితో అన్ని కార్యకలాపాలు సాగిస్తుండంతో సీనియర్ నేతలు గుర్రుగా వ్యవహరించి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.సూళ్లూరుపేట నియోజకవర్గంలో తాజాగా జరిగిన కొన్ని ఘటనలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయి. సూళ్లూరుపేటలో రెండు వర్గాలుగా ఉన్న నేతల్లో ఎంపీపీ అనిల్ రెడ్డికి ఎమ్మెల్యే సంపూర్ణ మద్దతు ఉండగా.. పురపాలక చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి దూరం అయ్యాడట.

పురపాలక వ్యవహారాలలో అనిల్ రెడ్డి తల దూర్చడంతో పాలకవర్గంలో గొడవలకు ఎమ్మెల్యే కారణంగా మారారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఛైర్మన్ శ్రీమంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియా కన్వీనర్ గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిగా బాబురెడ్డిని పురపాలకంలో తొలగించడం, ఆ తర్వాత తన కష్టాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పై ఎమ్మెల్యే బాబు రెడ్డిని పోలీసులతో కొట్టించడం పెద్ద చర్చిగా మారిందట.

ఆ సమయంలో ఆ వర్గం అంతా ఒక్కటై పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇది చల్లారకముందే అదే పురపాలకలో కో ఆప్షన్ మెంబెర్ గా ఉన్న సునీల్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేగా సాగిన ఎపిసోడ్ ఎండకడుతూ ఎమ్మెల్యే తీరు పై మీడియాకు సునీల్ రెడ్డి వెల్లడించడం పెద్ద దుమారమే రేపింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కలగజేసుకుని సునీల్ రెడ్డిని స్టేషన్‌ కి పిలిపించి కొట్టించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇలా సునీల్ రెడ్డి స్టేషన్లో ఉండగానే దబ్బల శ్రీమంత్ రెడ్డి తన వర్గంతో స్టేషన్‌ ను ముట్టడించిన ఘటన సూళ్లూరుపేటలో చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పూర్తి మద్దతు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికేనని నియోజకవర్గంలో ప్రచారం సాగుతుంది. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేణిగుంట విమానాశ్రయంలో టికెట్ విషయమై నేతల ముందరే చర్చించారని సంజీవయ్య నువ్వు నా గుండెల్లో ఉన్నావు నీకు ఏదైనా చేస్తా అంటూ టికెట్ రాదని హెచ్చరించేలా మాట్లాడారని ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంది.

సుళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను తనకు అనుగుణంగా మార్చుకునేందుకు ఎంపీ గురుమూర్తి నేరుగా సూళ్లూరుపేట నాయకులతో టచ్ లొ ఉంటున్నారట. సునీల్ రెడ్డి వ్యవహారంలో ఎంపీ గురుమూర్తి నాయుడుపేటలో మకాం పెట్టి ఎస్పీ, డీఐజీలతో మాట్లాడి సునీల్ రెడ్డిని విడిపించేందుకు సహకరించారట. ఎలాగూ ఎమ్మెల్యేకి ఎంపీకి దూరం పెరిగింది. నియోజకవర్గంలోని దాదాపు నేతలందరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఓ విజ్ఞప్తి అధిష్టానంకు అందజేసినట్లు సమాచారం. అది కూడా 32 రకాల అంశాలు పొందుపరిచినట్లు సమాచారం. అభ్యర్థి మార్పు అనివార్యమై అధిష్టానం ప్రత్యామ్నాయ చర్యల్లో ఉన్నట్లు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం చెబుతున్న మాట.

Advertisment
తాజా కథనాలు