Sukhesh Chandra Released One More Letter: లిక్కర్ కేసులో పొలిటికల్ లీడర్స్‌తో పాటు ప్రధానంగా వినిపిస్తున్న పేరు సుఖేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం మనీ లాండరింగ్ కేసులో (Money Laundering Case) జైలులో ఉన్న సుఖేష్... బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై (MLC Kavitha Arrest) లేఖ రాసి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలోనూ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు సుఖేష్. ప్రస్తుతం ఇతను సీఎం కొడుకునని, పీఎంవో అధికారినని, సుప్రీంకోర్టు జడ్జినని నమ్మించి రూ. 200 కోట్లు మోసం చేసిన కేసులో సుఖేష్ అరెస్ట్ అయ్యాడు. సుఖేష్‌పై 15కు పైగా FIRలు నమోదయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ (Delhi Liquor Scam) సుఖేష్‌కు సంబంధం ఉంది. గతంలో కవితపై సంచలన ఆరోపణలు చేశారు సుఖేష్. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ విడుదల చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా.. మరోసారి కవిత అరెస్ట్‌పై సుఖేష్ స్పందించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఎవరేం చేసినా తగ్గేదే లేదు..
గతంలో వెల్కమ్ టూ తీహార్ జైల్ అంటూ కవితకు లేఖ రాసిన సుకేశ్ ఇప్పుడుమరో లేఖను విడుదల చేశారు. .సీఎం కేజ్రీవాల్,మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని...అధికారం దుర్వినియోగం చేసి తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని ఆయన లేఖలో ఆరోపించారు. మాజీమంత్రి సత్యేంద్ర జైన్ అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారని చెప్పారు. జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా నన్ను బెదిరింపు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు సుకేశ్. మూడు రోజుల నుంచి జైల్ శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారుల ద్వారా నన్ను బెదిరిస్తున్నారు. స్టేట్మెంట్ ఇవ్వొద్దు అంటూ వత్తిడి చేస్తున్నారు. అయితే ఎవరు నన్ను బెదరించిన నేను వెనక్కు తగ్గను.మొత్తం నేతల బండారం బయట పెడతానంటూ లేఖలో పేర్కొన్నారు.
Also Read: Explainer: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం.. ఇప్పుడేం జరగనుంది?