Sukesh v/s Jacqueline : జాక్వెలిన్‌ రహస్యాలన్నీ బయటపెడతా.. మాజీ ప్రేయసిపై ఆగ్రహంగా సుకేశ్‌!

మనీలాండరీంగ్‌ కేసులో సుకేశ్‌, జాక్వెలిన్‌ నిందితులగా ఉన్న విషయం తెలిసిందే. తనను సుకేశ్‌ ట్రాప్‌ చేశాడని ఇటీవలే జాక్వెలిన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే జాక్వెలిన్‌ నేరం చేసిందని చెప్పడానికి తమ వద్ద ఉన్న చాట్‌లు, స్క్రీన్‌షాట్‌లు, మొదలైనవి బయటపెడతామని సుకేశ్‌ లాయర్ చెప్పారు.

Sukesh v/s Jacqueline : జాక్వెలిన్‌ రహస్యాలన్నీ బయటపెడతా.. మాజీ ప్రేయసిపై ఆగ్రహంగా సుకేశ్‌!
New Update

Bollywood : ఒకప్పుడు చట్టాపట్టాలేసుకోని తిరిగిన బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌(Jacqueline Fernandez), సుకేష్ చంద్రశేఖర్ ఇప్పుడు బద్ద శత్రువులగా మారినట్టు అనిపిస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడమే కాకుండా సీక్రెట్లు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) ప్రధాన నిందితుడిగా జైలు జీవితం గడుపుతున్నాడు. మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోలు గతంలో నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అయితే తనను సుకేశ్‌ ట్రాప్‌ చేశాడని జాక్వెలిన్ తన అప్పీల్‌లో పేర్కొంది. ఈ విషయంపై సుకేశ్‌ తరుఫు లాయర్లు స్పందించాడు.

Also Read: ఫ్యాన్స్‌లో టెన్షన్.. దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు కోహ్లీ రిటర్న్‌.. ఎందుకంటే?

రహస్యాలన్నీ బయటపెడతా:

సుకేష్ బెదిరింపుల నుంచి రక్షణ కోరుతూ జాక్వెలిన్ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తాను అమాయకురాలినని, తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును కోరింది. దీనిపై సుకేష్ చంద్రశేఖర్ తరపు న్యాయవాది అనంత్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాక్వెలిన్‌కు వ్యతిరేకంగా ఉన్న అన్ని సాక్ష్యాలను బయటపెడతానని చెప్పాడు. చాట్‌లు, స్క్రీన్‌షాట్‌లు, రికార్డింగ్‌లు మొదలైన వాటితో సహా ఇప్పటివరకు ఎవరికి తెలియని సాక్ష్యాలను బయటపెడుతన్నట్టు తెలిపారు. అయితే లాయర్‌ ఎక్కడా కూడా జాక్వెలిన్‌ పేరు ఎత్తలేదు. 'సంబంధిత వ్యక్తి' అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ప్రపంచానికి నిజం తెలియాలని సుకేశ్‌ చెప్పారు.

అటు నిందితుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ED)కు నోటీసు జారీ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ నేరానికి పాల్పడలేదని, అలాగే నేరాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఆమె వద్ద లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read: ఇక కుస్తీ పట్టను.. సాక్షి మాలిక్ ఎమోషనల్

WATCH:

#bollywood #jacqueline-fernandez #crime-news #sukesh-chandrashekhar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe