Rushikonda Palace: టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి విశాఖలోని రుషికొండ అంశం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ హయాంలో తీర్చిదిద్దని భవనాలు, వసతులపై పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబుకు (CM Chandrababu Naidu) సుఖేష్ చంద్రశేఖర్ సంచనల లేఖ రాశాడు. ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైల్ లో (Tihar jail) నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న సుఖేష్.. రుషికొండ ప్యాలెస్ అమ్మినా, లీజుకు ఇచ్చిన తనకు కావాలని కోరాడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తి నెలకొంది.
ఈ మేరకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ ప్రకారం.. రుషికొండ ప్యాలెస్ అమ్మినా, లీజుకు ఇచ్చిన మొదటే నన్నే సంప్రదించండి. మార్కెట్ రేటు కంటే 20 శాతం ఎక్కువ చెల్లిస్తా. చెన్నై, గోవా, దుబాయి, బార్సిలోనాలో నాకు హోటల్స్, బిజినెస్ లు ఉన్నాయి. నా వ్యాపారాలన్నీ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. రుషికొండ ప్యాలెస్ ఇస్తే విజయవంతగా నడిపిస్తా. విశాఖతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నా బాల్యం విశాఖలో గడిచింది. మా అమ్మమ్మది విశాఖనే. నాపై ఉన్న కేసులు ఆరోపణలు మాత్రమే. ఒక్క కేసు కూడా రుజువు కాలేదు’ అంటూ రాసుకొచ్చాడు.
Also Read: సహజత్వం కోల్పోయిన జీవనదులు.. పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు..!