Gudmar Plant: భూమిపై ఉండే మొక్కల్లో అద్భుత ఔషదాలున్నాయన్న విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి అనేక ఆయుర్వేద ఔషధాలతో నిండి ఉందని ఆయుర్వేద డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. వాటి గురించి సరైనా సమాచారం లేక.. కొన్ని చోట్ల ఈ మందులు, మరి కొన్నిచోట్ల ఇంటి అందం కోసం ఈ మొక్కల్ని పెంచుకుంటున్నారు. కొన్ని చోట్ల అవి కలుపు మొక్కల రూపంలో పడి ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మొక్క బెల్లంలోని తీపిని చంపే ఔషధాన్ని బెల్లం మందు అని అంటారు. అంతేకాదు షుగర్, కాలేయం, పాము కాటు, ఊబకాయం, బీపీ, పిసిఒడి, చర్మం వంటి అనేక తీవ్రమైన వ్యాధులలో ఈ ఔషధం ప్రత్యేకంగా పని చేస్తుంది. ఇది చాలా ప్రయోజనకరమైన, ప్రభావవంతమైన ఔషధ మొక్క అని ఆయుర్వేద డాక్టర్ చెబుతున్నారు. ఇది చక్కెరను నయం చేయదు కానీ అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలాంటి మొక్క గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
గుడ్మార్ ఔషధంలోని అద్భుతం..
షుగర్ నియంత్రణకు గుడ్మార్ వినియోగిస్తున్నట్లు డాక్టర్ చెబుతున్నారు. అంతేకాదు మలేరియా, పాము కాటులో కూడా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులను నమలడం లేదా రసం తాగడం వల్ల చక్కెర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులను ఎండబెట్టి కషాయాలు. పొడిని తయారు చేస్తారు. బాలికలలో పాలిసిటిక్ ఓవరీ డిసీజ్ సమస్యలతో పాటు రక్తపోటు, ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. దీని ఆకుల పొడిని కొబ్బరినూనెలో కలిపి రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు పోతాయి. కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
డాక్టర్ల సలహాతోనే వాడాలి
ప్రతి ఔషధం దాని స్వంత దుష్ప్రభావాలను కలిగి ఉన్నందున దీనిని ఎక్కువగా ఉపయోగించకూడదు. ఆయుర్వేద వైద్యుడు లేకుండా ఏ ఔషధం వాడినా ప్రయోజనం ఉండదు. కావునా.. వయస్సు, బరువును బట్టి సరైన మోతాదును ఆయుర్వేద వైద్యుడు మాత్రమే నిర్ణయించగలరు. అతిగా వాడితే శరీరంలో వణుకు, చంచలత్వం, బలహీనత లేదా తలతిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎలాంటి సమస్యలు ఉన్నా.. మంచి ఆయుర్వేద డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: మీ భాగస్వామి అబద్ధం చెబితే ఎలా గుర్తించవచ్చు? ఇవి తెలుసుకోండి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.