Sudheer Babu : వాయిదా పడ్డ 'హరోం హర' మూవీ రిలీజ్.. బాధగా ఉందంటూ సుదీర్ బాబు పోస్ట్!

సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'హరోం హర' రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో సుదీర్ బాబు తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. పలు కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. జూన్ 14 న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం అని పేర్కొన్నాడు.

New Update
Sudheer Babu : వాయిదా పడ్డ 'హరోం హర' మూవీ రిలీజ్.. బాధగా ఉందంటూ సుదీర్ బాబు పోస్ట్!

Sudheer Babu's Harom Hara Movie Release Postponed : టాలీవుడ్ (Tollywood) అప్ కమింగ్ యాక్టర్స్ లో ఒకరైన సుధీర్ బాబు (Sudheer Babu) విభిన్న తరహా సినిమాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కమర్షియల్ కథలు కాకుండా ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపే ఈ హీరో గత కొంత కాలంగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.

ఈ మధ్య సుధీర్ బాబు చేసే సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని 'హరోం హర' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో సుదీర్ బాబు తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

Also Read : భార్యతో కలిసి దాబాలో లంచ్ చేసిన అల్లు అర్జున్.. బన్నీ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా!

ఆ డేట్ మిస్ అయినందుకు బాధగా ఉంది

సుదీర్ బాబు తన ట్విట్టర్ లో.. " పలు కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. జూన్ 14 న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. మొదట కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ ఆ డేట్ మిస్ అయినందుకు బాధగా ఉంది. జూన్ నెల నాకు బాగా కలిసొస్తుంది.

గతంలో నేను నటించిన ప్రేమకథా చిత్రమ్, సమ్మోహనం సినిమాలు జూన్ లోనే రిలీజై ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అలాగే 'హరోం హర' (Harom Hara) కూడా కచ్చితంగా మీ అంచనాలను అందుకుంటుంది" అని పేర్కొన్నాడు. జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా.. సునీల్, అక్షర కీలక పాత్రలు పోషించారు.

Advertisment
తాజా కథనాలు