Sudan: సైనికుల లైంగిక వాంఛ తీరిస్తేనే ఆహారం.. మహిళలపై సుడాన్ బలగాల దుశ్చర్య!

ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో సైనికులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన సంచలనం రేపుతోంది. అంతర్యుద్ధం వల్ల కొందరు పారిపోగా అక్కడే చిక్కుకుపోయిన 24 మంది మహిళలు ఆహారం కోసం వస్తే బలవంతంగా లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

New Update
Sudan: సైనికుల లైంగిక వాంఛ తీరిస్తేనే ఆహారం.. మహిళలపై సుడాన్ బలగాల దుశ్చర్య!

Sudan Soldiers sexually assault women: ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో జరుగుతున్న ఓ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆహారం ఆశ చూపి మహిళలపై సైనికులు లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ మేరకు ఒమ్దుర్‌మన్‌ పట్టణంలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల చాలామంది కుటుంబాలతో పారిపోగా 24 మంది మహిళలు కుటుంబాలతో సహా అక్కడే చిక్కుకుపోయారు. దీంతో కనీస అవసరాలకోసం సైన్యంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇది కూడా చదవండి:NFHS: భారత్‌కు ఒబేసిటీ ముప్పు.. ఆర్థిక సర్వే సంచలన రిపోర్ట్!

ఈ క్రమంలోనే భద్రతా బలగాలు స్థానిక ఫ్యాక్టరీల్లోనే ఆహార నిల్వలు ఏర్పాటు చేయగా.. రోజువారిగా ఇంట్లోని వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలకు ఆహారం తీసుకొనేందుకు వచ్చిన మహిళలో సైనికులు లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఖాళీ ఇళ్లల్లో మిగిలిపోయిన వస్తువులను తీసుకోవాలన్నా మహిళలు సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే. అయితే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన బాధిత మహిళ.. ఇలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా రావొద్దు. నా బిడ్డల ఆకలి తీర్చడానికే నేను వారు చెప్పినట్లు చేయాల్సివచ్చిందంటూ కన్నీరు పెట్టుకుంది. కొందరు సైనికులు పాత ఇళ్ల వద్దకు మహిళలను బలవంగా తీసుకొచ్చి వరుసగా నిలబెట్టి, నచ్చినవారిని ఎంచుకుంటున్నట్లు తెలిపింది. సైనికులు చెప్పినట్లు చేయకపోవడంతో 21 ఏళ్ల మహిళ కాళ్లకు నిప్పుపెట్టారని చెప్పింది. ప్రస్తుతం ఈ దారుణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవగా.. 2024 ఏప్రిల్‌ లో అంతర్యుద్ధం మొదలవగా.. సైన్యం, ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ మధ్య ఘర్షణ సివిల్ వార్‌కు దారితీసింది. దీంతో రెండు వర్గాలు తమను లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు