Crime News: 7 రోజులు.. రెండు హై ఫ్రొఫైల్ హత్యలు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

వారం వ్యవధిలో.. దేశంలో రెండు హైప్రొఫైల్ హత్య కేసులు నమోదయ్యాయి. జనవరి 3న గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవగా.. తాజాగా సుచనా సేథ్‌ తన కుమారుడిని చంపేశారు. ఈ రెండు కేసులను పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు.

New Update
Crime News: 7 రోజులు.. రెండు హై ఫ్రొఫైల్ హత్యలు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

ఇది కలికాలం కాదు.. క్రైమ్ కాలం.. నిత్యం ఏదో ఒక చోట కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్స్‌ జరుగుతున్నాయి. అసలు మనుషుల్లో ఇంత క్రూరత్వం ఎందుకు వస్తుందో అర్థంకావడం లేదు. సాటి మనిషులను, అందులోనూ కుటుంబసభ్యులను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్న వారిలో చదువుకుని, ఉన్నత పదవుల్లో ఉన్నవారే కావడం బాధాకరం. వారం వ్యవధిలో జరిగిన రెండు హత్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఒక వారం వ్యవధిలో.. దేశంలో రెండు సంచలనాత్మక, హైప్రొఫైల్ హత్య కేసులు బయటకొచ్చాయి. జనవరి 3న హర్యానా(Haryana)లోని గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల మాజీ మోడల్ దివ్య పహుజా(Divya Pahuja) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి. పహుజా మృతదేహం ఇంకా లభ్యం కానప్పటికీ, హోటల్ మేనేజర్‌తో సహా ముగ్గురు వ్యక్తులను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు.

సుచనా సేథ్‌ ఇష్యూ:
గురుగ్రామ్ ఘటన జరిగిన వారంలోపే తాజాగా మైండ్‌ఫుల్ AI ల్యాబ్ CEO అయిన సుచనా సేథ్(Suchana Seth) , కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో తన నాలుగేళ్ల కుమారుడిని ఆరోపిస్తూ హత్య చేసినందుకు అరెస్టు చేశారు. కుమారుడి మృతదేహాన్ని బ్యాగులో తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. ఈ రెండు కేసులను పోలీసులు దాదాపు 24 గంటల్లోనే ఛేదించారు.

WATCH: కుమారుడిని చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. సీఈవో క్రైమ్‌ ఎపిసోడ్‌తో విస్తుపోయే వాస్తవాలు!

గురుగ్రామ్‌లో ఏం జరిగింది?
గురుగ్రామ్ లోని ఓ హోటల్‌లో దివ్య పహుజా దారుణ హత్యకు గురైంది. ఈ హత్యలో హోటల్‌ యజమానే ప్రధాన నిందితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జనవరి 2 వ తేదీన హోటల్ కి అభిజిత్‌, దివ్య పహుజా, మరో వ్యక్తి కలిసి వచ్చారు. వారు గది నంబర్‌ 11కి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అదే రోజు రాత్రి అభిజిత్‌ తో పాటు మరో వ్యక్తి కలిసి దివ్య మృతదేహాన్ని ఓ దుప్పటి లో చుట్టి గది నుంచి బయటకు లాక్కెళ్లడం కనిపిస్తుంది. ఆ తరువాత నీలిరంగు బీఎమ్ డబ్ల్యూ కారులో అక్కడ నుంచి పారారవ్వడం కనిపించింది. హోటల్‌ యజమాని అభిజిత్‌ తన సహచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని, ఆ తరువాత ఆమె మృతదేహాన్ని మాయం చేయడానికి తన అనుచరులకు సుమారు 10 లక్షల రూపాయలు కూడా చెల్లించినట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో అభిజిత్‌ ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

గోవా హత్య:
సోమవారం నాడు సుచనా సేథ్‌ను కర్ణాటక పోలీసులు ఆమె కుమారుడి మృతదేహంతో అరెస్టు చేయడంతో గోవా హత్య వెలుగులోకి వచ్చింది.

రెండు కేసుల్లో కీలకమైన విషయాలు:
గురుగ్రామ్ కేసు:

➼ దర్యాప్తు కొనసాగుతోంది, బాధితురాలి మృతదేహం దొరకలేదు.
➼ అరెస్టులు జరిగాయి, కానీ కీలకమైన సాక్ష్యం, అంటే విక్టిమ్‌ డెడ్‌బాడీ కనిపించాల్సి ఉంది.
➼ క్లెయిమ్‌లను ధృవీకరించడానికి అదనపు సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

గోవా కేసు:
➼ నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితురాలిని అరెస్టు చేశారు.
➼ అపార్ట్ మెంట్ గదిలో ఎర్రటి మరకలు ఉండడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
➼ బాధితుడి మృతదేహం లభ్యమైంది.

Also Read: రోహిత్ శర్మపై ఐసీసీ సీరియస్‌.. నిషేధం తప్పదా?

WATCH:

Advertisment
తాజా కథనాలు