Subway: మెక్ డొనాల్డ్స్ రూట్ లోనే సబ్ వే, డోమినోస్, కేఎఫ్ సీ

మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఇప్ప‌టికే త‌మ మెనూ నుంచి ట‌మాటాల‌ను తొల‌గించారు. నాణ్య‌తా ప్ర‌మాణాలు కొర‌వ‌డినందునే ఇలా చేశామ‌ని మెక్‌డొనాల్డ్స్ చెబుతుండ‌గా ట‌మాటాల ధ‌ర‌లు రికార్డు స్ధాయికి చేర‌డం కూడా ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. సబ్ వే, మెక్ డొనాల్డ్స్, బాట‌లోనే డామినోస్‌, కేఎఫ్ సీ ట‌మాటాల వాడ‌కం త‌గ్గించాయి

New Update
Subway: మెక్ డొనాల్డ్స్ రూట్ లోనే సబ్ వే, డోమినోస్, కేఎఫ్ సీ

టమాటాల(Tamoto) ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటాల ధర రూ.150 నుంచి రూ.200ల దాకా ఉంది. దీంతో టమాటాల వాడకాన్ని సమాన్యులు తగ్గించేశాయి. ఈ క్రమంలోనే ప్రముఖ రెస్టారెంట్ మెక్ డొనాల్డ్స్ (mcdonald's) టమాటా వినియోగాన్ని తగ్గించేసింది. ఇప్పుడు ఇదే రూట్ లో సబ్ వేతో పలు రెస్టారెంట్లు కూడా టమాటాల వినియోగాన్ని తగ్గించింది. భారత్ లో పలు సబ్ వే (Subway) అవుట్ లెట్లు తమ సలాడ్స్, శాండ్ విచ్ లలో టమాటాల సర్వ్ చేయడాన్ని తగ్గించాయి. అధిక ధరల కారణంగా సబ్ వే ఈ నిర్ణయం తీసుకుంది.

నిత్యావ‌స‌ర కూర‌గాయల ధ‌ర ఇటీవ‌ల ఏకంగా 400 శాతానికి ఎగ‌బాక‌డం, ప్ర‌భుత్వం రంగంలోకి దిగినా ట‌మాట ధ‌ర‌లు కిలో ఏకంగా రూ.150లకి పైగా ప‌లుకుతుండ‌టంతో వంట‌కాల్లో ట‌మాటా క‌నిపించ‌డ‌మే గ‌గ‌న‌మైంది. ట‌మాటాలు తాత్కాలికంగా అందుబాటులో లేనందున మ‌న్నించాల‌ని ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్ టెర్మిన‌ల్‌ లోని ఓ స‌బ్‌ వే అవుట్‌ లెట్ బోర్డును డిస్‌ప్లే చేసింది. త‌మ నాణ్య‌తా ప్ర‌మాణాల‌కు అనుగుణంగా త‌గినంత‌గా ట‌మాటాల స‌ర‌ఫ‌రాలు లేవ‌ని అవుట్‌ లెట్ పేర్కొంది.

వీలైనంత త్వరగానే టమాటాల సేకరణను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కస్టమర్లకు భరోసానిచ్చింది. అయితే మరికొన్ని సబ్ వేలలో మాత్రం టమాటాలను సర్వ్ చేస్తున్నారు. ఢిల్లీలో రెండు స్టోర్ల‌తో పాటు యూపీలో ఒక‌టి, చెన్నైలో ఒక స్టోర్ ‌లో ట‌మాటాల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌టంతో దూరం పెట్టారు.

ఇక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్స్ ఇప్ప‌టికే త‌మ మెనూ నుంచి ట‌మాటాల‌ను తొల‌గించారు. నాణ్య‌తా ప్ర‌మాణాలు కొర‌వ‌డినందునే ఇలా చేశామ‌ని మెక్‌డొనాల్డ్స్ చెబుతుండ‌గా ట‌మాటాల ధ‌ర‌లు రికార్డు స్ధాయికి చేర‌డం కూడా ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. సబ్ వే, మెక్ డొనాల్డ్స్, బాట‌లోనే డామినోస్‌, కేఎఫ్ సీ ట‌మాటాల వాడ‌కం త‌గ్గించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు