తల, మెడ భాగంలో క్యాన్సర్ సోకిన బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. భారత్‌లో ఇలాంటివి 26 శాతం కేసులు ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ రిపోర్టును అధికారులు విడుదల చేశారు. 1869 మంది క్యాన్సర్ పేషెంట్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా దీన్ని వెల్లడించారు. ఢిల్లీకి చెందిన ఎన్జీవో క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ ఈ సర్వే చేపట్టింది.
Also read: ఒలిపింక్స్‌లో స్టెరాయిడ్స్ తీసుకొని దొరికిపోయాడు.. చివరికి
ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 30 మధ్య హెల్ప్‌లైన్ నెంబర్‌కు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. యువకుల్లోనే ఎక్కువగా.. తల, మెడ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. పొగాకు వాడటం, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 90 శాతం వరకు నోటి క్యాన్సర్ రోగులు పోగాకు వాడినట్లు తేలింది. పొగాకు వాడకాన్ని నిషేధిస్తే.. చాలావరకు క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.
Also Read: కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!