Telangana: పెరుగుతున్న తల, మెడ క్యాన్సర్ కేసులు.. తల, మెడ భాగంలో క్యాన్సర్ సోకిన బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. భారత్‌లో 26 శాతం ఇలాంటి కేసులు ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ రిపోర్టును అధికారులు విడుదల చేశారు. By B Aravind 27 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి తల, మెడ భాగంలో క్యాన్సర్ సోకిన బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. భారత్‌లో ఇలాంటివి 26 శాతం కేసులు ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. వరల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ డే సందర్భంగా ఈ రిపోర్టును అధికారులు విడుదల చేశారు. 1869 మంది క్యాన్సర్ పేషెంట్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా దీన్ని వెల్లడించారు. ఢిల్లీకి చెందిన ఎన్జీవో క్యాన్సర్ ముక్త భారత్ ఫౌండేషన్ ఈ సర్వే చేపట్టింది. Also read: ఒలిపింక్స్‌లో స్టెరాయిడ్స్ తీసుకొని దొరికిపోయాడు.. చివరికి ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 30 మధ్య హెల్ప్‌లైన్ నెంబర్‌కు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. యువకుల్లోనే ఎక్కువగా.. తల, మెడ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. పొగాకు వాడటం, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 90 శాతం వరకు నోటి క్యాన్సర్ రోగులు పోగాకు వాడినట్లు తేలింది. పొగాకు వాడకాన్ని నిషేధిస్తే.. చాలావరకు క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. Also Read: కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్! #telugu-news #cancer #head-cancer #neck-cancer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి