Osmania University: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. అధికారుల తీరుపై ఆగ్రహం

ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్‌లో కనీస మౌలిక సదుపాయలు కల్పించడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వేసవిలో మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Osmania University: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. అధికారుల తీరుపై ఆగ్రహం
New Update

Protest At Osmania University: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. హాస్టల్స్‌లో కనీస మౌలిక సదుపాయలు కూడా కల్పించడం లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేసవి కాలంలో కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజుల నుంచి తాము హాస్టల్స్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: సూర్యాపేటలో విషాదం.. ప్రేమ పెళ్లి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య

తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు కూడా విజ్ఞప్తి చేశామని చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్లు విద్యార్థులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారులు.. హాస్టల్స్‌లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం ఏంటంటూ నిలదీస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

#osmania-university #telugu-news #osmania-university-students #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe