Kakinada: గాంధీనగర్‌లోని నేషనల్‌ కాలేజీ ఆప్‌ నర్సింగ్‌ ముందు విద్యార్థునులు ఆందోళన

కాకినాడ జిల్లా గాంధీనగర్‌లోని నేషనల్‌ కాలేజీ ఆప్‌ నర్సింగ్‌ ముందు విద్యార్థునులు ఆందోళనకు దిగారు. తమపై ఎండీ వెంకట్రావు, అతని స్నేహితులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Kakinada: గాంధీనగర్‌లోని నేషనల్‌ కాలేజీ ఆప్‌ నర్సింగ్‌ ముందు విద్యార్థునులు ఆందోళన
New Update

కాకినాడ జిల్లా గాంధీనగర్‌లోని నేషనల్‌ కాలేజీ ఆప్‌ నర్సింగ్‌ ముందు విద్యార్థునులు ఆందోళనకు దిగారు. తమపై ఎండీ వెంకట్రావు, అతని స్నేహితులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు టీసీ ఇవ్వాలని విద్యార్ధునులు డిమాండ్‌ చేశారు. హాస్టల్‌లో సరైన సౌకర్యాలు లేవని, హాస్టల్‌కు వాచ్‌మెన్‌ కూడా లేడన్నారు. వాచ్‌మెన్‌ విషయం గురించి మాట్లాడితే ఎండీ వెంకట్రావు బూతులు తిడుతూ తమపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాత్రి సమయంలో వెంకట్రావు, అతని స్నేహితులు హాస్టల్‌ రూమ్‌లోకి వస్తున్నారని, తమను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు.

మరోవైపు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతుల తల్లిదండ్రులు.. పిల్లలను బూతులు తిట్టడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా విద్యార్థునులకు యస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా యువతులను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. దీంతో నర్సింగ్‌ కాలేజి యాజమాన్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. మరోవైపు యువతుల తల్లిదండ్రుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులకు నచ్చ చెప్పారు. కళాశాలలో ఎండీ లేకపోవడంతో యువతులను వారి తల్లిదండ్రుల వెంట పంపారు.

నర్సింగ్‌ కళాశాలలో అధిక శాతం మంది విద్యార్ధునులు శ్రీకాకుళం, విశాఖకు చెందిన వారు చదువుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా యువతులపై వేధింపులకు గురిచేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నారు. కాగా ప్రస్తుతం నర్సింగ్‌ కాలేజీ ఎండీ పరారీలో ఉండా, లేక అంతకు ముందే లీవ్‌లో వెళ్లాడా అనేది తేలాల్సి ఉంది. ఎండీ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.  

#national-college-of-nursing #andolan #md #kakinada #students #venkatarao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి