Viral video: స్కూల్ టీచర్ పై చెప్పుల దాడి.. తరిమికొట్టిన విద్యార్థులు!

పీకలదాకా మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులు తగిన బుద్ది చెప్పారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతుపై చెప్పులు విసురుతూ స్కూల్ గేటు బయటకు తరిమికొట్టారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వీడియో వైరల్ అవుతోంది.

Viral video: స్కూల్ టీచర్ పై చెప్పుల దాడి.. తరిమికొట్టిన విద్యార్థులు!
New Update

Students Attacked Teacher: పీకలదాకా మద్యం తాగి పాఠశాలకు వచ్చిన ఓ ఉపాధ్యాయుడికి విద్యార్థులు తగిన బుద్ది చెప్పారు. తప్పతాగి తప్పటడుగులు వేస్తూ స్కూల్ లోకి వచ్చి పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా దూషణలకు దిగాడు. దీంతో తాగుబోతు అరాచాకాలు సహించలేక బాలలంతా కలిసి అతనిపై ఎదురు దాడి చేశారు. ఈ ఘటన ఛత్తీస్ గడ్ (Chhattisgarh) బస్తర్ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

This browser does not support the video element.

సరైన బుద్ధి చెప్పారంటూ ప్రశంసలు..

ఈ మేరకు తాగిన మైకంలో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ఉపాధ్యాయడిని పాఠశాల ప్రాంగాణం నుంచి తరిమికొట్టారు. చదువు చెప్పకుండా తిడతావా.. అంటూ చెప్పులు విసురుతూ గేటు బయట వరకు తరిమేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. సరైన బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు చిన్నారులను మెచ్చుకుంటున్నారు.

Also Read: దంత వైద్యం చేస్తున్న చిలుక.. వీడియో వైలర్!

#chhattisgarh #students-attacked #teacher
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe