Andhra Pradesh : హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో బీసీ గురుకుల హస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్ కావడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఆరుగురు విద్యార్థుల్ని ఆసుపత్రి తరలించగా.. మిగిలిన వారికి హాస్టల్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Andhra Pradesh : హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత..
New Update

Food Poison : అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనసలో బీసీ గురుకుల హస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్(Food Poison) అయ్యింది. దీంతో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. మధ్యాహ్నం చికెన్ కర్రీతో బిర్యాని తిన్న తర్వాత కడుపునొప్పి, బ్లడ్‌ మోషన్స్‌తో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అందులో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి తీవ్రతరం కావడంతో వారిని అమలాపురం ఏరియా ఆసుపత్రిలోకి తరలించారు. విద్యార్థులకు యాంటిబయేటిక్స్ అందిస్తన్నామని.. వారు కోలుకునేవరకు ఆసుపత్రిలోనే అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిందన్న సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ శ్రీకాంత్, ఫుడ్‌ కార్పొరేషన్ మెంబర్ కిరణ్ హుటాహుటినా ఆసుపత్రికి వచ్చారు.

Also Read: టీఎస్‌ఆర్టీసీ రికార్డు.. ఒక్కరోజులోనే బస్సుల్లో 50 లక్షల మంది ప్రయాణం..

అనంతరం ఫుఢ్‌ కార్పొరేషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ ఆసుపత్రి నుంచి నేరుగా హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. అలాగే జాయింట్ కలెక్టర్ హాస్టల్‌కు డాక్టర్లను పంపించారు. మరికొంతమంది విద్యార్థులకు వైద్యులు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. అయితే హాస్టల్ సిబ్బంది విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచడంతో కిరణ్.. వారిపై మండిపడ్డారు. గతంలో ఇదే హాస్టల్‌ సిబ్బందిపై మెమో ఇచ్చినా వారి తీరు మారలేదు. ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసి సిబ్బందిపై చర్యలు తీసుకునేలా చేస్తానని కిరణ్ తెలిపారు.

Also Read: తీర్థం పేరిట జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తాగించి.. 11 మందిపై దారుణం

#ambedkar-konaseema-district #bc-hostel #food-poison #ap-news #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe