AP Crime: రాజంపేట డీమ్డ్‌ వర్సిటీ లేడీస్‌ హాస్టల్‌లో దారుణ సంఘటన

అన్నమయ్య జిల్లా రాజంపేట డీమ్డ్‌ వర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని రేణుక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రేణుక మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు.

New Update
AP Crime: రాజంపేట డీమ్డ్‌ వర్సిటీ లేడీస్‌ హాస్టల్‌లో దారుణ సంఘటన

Deemed University:అన్నమయ్య జిల్లా రాజంపేట డీమ్డ్‌ వర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని రేణుక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నంద్యాలకు చెందిన రేణుక మూడు రోజుల కిందటే ఇంటి నుంచి హాస్టల్‌కు వచ్చినట్టు చెబుతున్నారు. మధ్యాహ్నం వరకు కాలేజీలోనే ఉందని, భోజనం చేసిన తర్వాత రూమ్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

రేణుక మృతిపై తల్లిదండ్రులు అనుమానం:

సహచర విద్యార్థినులు తలుపుతట్టడంతో ఎంతసేపటికీ తెరవకపోయే సరికి తలుపులు పగలగొట్టి చూస్తే శవమై కనిపించిందని అంటున్నారు. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన విద్యార్థినిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చామని సిబ్బంది చెబుతున్నారు. అయితే రేణుక మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు. విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతున్నారు. గతంలోనూ ఇదే వర్శిటీలో విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చాలా ఉన్నాయని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: తిరుమలకు వెళ్లాలనుకుంటే ఇప్పుడే ప్లాన్‌ చేసుకోండి

Advertisment
తాజా కథనాలు